బాలి’ చిత్రం తర్వాత ‘2.0’ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమాతో పాటు తాజాగా మరోసారి ‘కబాలి’ ఫేం రంజిత్ పా దర్శకత్వంలో ‘కాలా’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభం అయ్యింది. రజినీకాంత్ అల్లుడు ధనుష్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదటి నుండి కూడా విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. మొదట ఈ సినిమా ఒక మాఫియా డాన్‌కు సంబంధించిన కథ అనే వార్తలు రావడంతో ఆ డాన్ కుటుంబ సభ్యుల నుండి హెచ్చరికలు వచ్చాయి. తాజాగా మరో వివాదంలో ఈ సినిమా చిక్కుకుంది.
రజినీకాంత్ ప్రస్తుతం నటిస్తున్న కథ నాది అంటూ రాజశేఖరన్ అనే రచయిత పోలీసులను ఆశ్రయించాడు. తాను ధనుష్ తండ్రి కస్తూరి రాజా వద్ద అసిస్టెంట్‌గా ఉన్న సమయంలో రజినీకాంత్‌తో ఒక సినిమా చేసేందుకు ‘కరికాలన్’ కథను సిద్దం చేశాను. ఆ టైటిల్‌ను ఛాంబర్లో రిజిస్ట్రర్ కూడా చేయించాను. అయితే ఇప్పుడు అదే కథతో ధనుష్ ‘కాలా’ సినిమాను నిర్మిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం విచారణ మొదలు పెట్టారు.
రజినీకాంత్ ఏ సినిమా మొదలు పెట్టిన ఇలాంటి వివాదం ఏదో ఒకటి వస్తూనే ఉంది. తాజాగా మరో వివాదం చెలరేగడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటిని పట్టించుకోకుండా రంజిత్ పా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు.
