అదే రజినీకాంత్‌ లాస్ట్‌ మూవీ

తమిళనాడు రాజకీయాల్లోకి రజినీకాంత్‌ ఎంట్రీ దాదాపుగా ఖరారు అయ్యింది. ఎన్నో అంచనాల నడుమ రజినీకాంత్‌ రాజకీయ ప్రకటన చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఈ సమయంలోనే ఆయన సినిమాల గురించి కూడా ఒక అనధికారిక ప్రచారం జరుగుతుంది. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత రజినీకాంత్‌ సినిమాలకు పూర్తిగా దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాల తర్వాత రజినీకాంత్‌ సినిమాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ‘2.0’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ‘కబాలి’ దర్శకుడు రంజిత్‌ పా దర్శకత్వంలో అల్లుడు ధనుష్‌ నిర్మాణంలో ‘కాలా’ అనే చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ‘2.0’ చిత్రం ఇదే సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, వచ్చే సంవత్సరం ఆరంభంలో ‘కాలా’ సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

‘కాలా’ విడుదల తర్వాత రజినీకాంత్‌ రాజకీయాలకే పూర్తిగా పరిమితం కాబోతున్నాడు. రాజకీయాల్లో అటు ఇటుగా ఫలితం ఉన్నా కూడా మళ్లీ సినిమాల్లోకి రావాలని ఆయన కోరుకోవడం లేదు అంటూ తమిళ సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. రజినీకాంత్‌ సినిమాలకు దూరం అవుతున్నాడనే బాధ ఉన్నా కూడా రాజకీయాల్లోకి వస్తున్నాడనే సంతోషంతో ఆయన ఫ్యాన్స్‌ ఉన్నారు.

To Top

Send this to a friend