రజినీ పొలిటికల్ పంచ్ ‘కాలా’

రాజకీయాల్లోకి రావడానికి తహతహలాడుతున్న రజినీ అందుకనుగుణమైన పొలిటికల్ కథను ఎంచుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ ఆధ్వర్యంలో 2.0 రోబో సినిమాలో నటిస్తున్న సూపర్ స్టార్ ఆ సినిమా షూటింగ్ టైంలోనే మరో సినిమాను అనౌన్స్ చేశాడు.

ఈ సినిమా ఆయన సొంత బ్యానర్ లో వస్తుండడం గమనార్హం. రజినీ అల్లుడు , హీరో ధనుష్ ఈ సినిమాకు నిర్మాత.. కబలీ సినిమా తీసిన పా రంజిత్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాకు కాలా అనే టైటిట్ కన్ఫమ్ చేసి రజినీ ఫేస్ తో ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. కరికాలన్ అనే ట్యాగ్ లైన్ ను తగిలించారు. కరికాలన్ అంటే యోధుడు, సమర్ధుడు అని అర్థం.

కబాలీతో ఆశించిన విజయం సాధించలేకపోయిన దర్శకుడు పా రంజిత్ ఈసారి రజినీ కోసం పొలిటికల్ కథను ఎంచుకున్నట్టు తెలిసింది. ఆ కథను రజినీకాంత్ కు వినిపించడం.. కథ నచ్చి రజినీయే నిర్మాణంలోకి దిగడం విశేషం. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాను టైటిల్స్ ను ఈరోజు అన్ని భాషల్లో విడుదల చేయడం విశేషం.

To Top

Send this to a friend