ఎప్పుడు రావాలో తెలిసినవాడు రజినీ..

కొద్దిరోజులుగా తమిళనాట రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా వరుసగా అభిమానులతో సమావేశమవుతున్నారు. రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్న రజినీకాంత్ బీజేపీలో చేరతారనే వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఈ విషయం తెలిసి తమిళనాట తొలిసారి రజినీ దిష్టిబొమ్మలను కొందరు దహనం చేశారు. ఇంతవరకు తమిళనాడులో రజినీ చిత్రపటాలకు క్షీరాభిషేకం చూసిన జనాలకు ఇది కొత్తగా అనిపించింది. కానీ రజినీ బీజేపీలో చేరతారనే విషయం తెలిసేసరికి రాష్ట్రమంతా భగ్గుమన్నారు.

జల్లికట్టు ఉద్యమంతో పాటు తమిళనాడు రాజకీయాలను ఆగమాగం చేసిన బీజేపీపై తమిళులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అమ్మ జయలలిత చనిపోయాక తమిళనాడు రాజకీయాల్లో దూరి అస్తవ్యస్తం చేసిన బీజేపీ అంటేనే తమిళనాట జనాలు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో రజినీ బీజేపీలో చేరతారనే వార్తలు వెలువడడంతో రజినీపై ఉన్న అభిమానం, ప్రేమ పోయి ఆయన దిష్టిబొమ్మలను దహనం చేసేవరకు పరిస్థితి వెళ్లింది.

దీంతో రజినీ వెనక్కి తగ్గారు. బీజేపీలో చేరకుండా కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. బీజేపీపై ఉన్న వ్యతిరేకత తన మీద రాకుండా రజినీ చూసుకుంటున్నాడు. తన రాజకీయ భవిష్యత్ కోసం వరుసగా నాయకులు, అభిమానులతో భేటి అవుతూ వచ్చే 2019 ఎంపీ ఎలక్షన్స్ కల్లా రెడీ కావాలని రజినీ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. రజినీకున్న అభిమానం దృష్టా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తే ఆయన విజయం తథ్యం. జయలలిత మరణం.. ప్రత్యామ్మాయ నాయకుల కొరత దృష్ట్యా రజినీ ఎంట్రీకి ఇదే మంచి తరుణమని భావిస్తున్నట్టు తెలిసింది.

To Top

Send this to a friend