టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ‘బాహుబలి’ సినిమాతో ఎక్కడికో వెళ్లి పోయాడు. తన స్థాయిని అమాంతం పెంచేసుకున్నాడు. ప్రస్తుతం హాలీవుడ్ దర్శకులు కూడా రాజమౌళి వైపు చూస్తున్నారు. బాలీవుడ్ నిర్మాతలు ఎంతో మంది రాజమౌళితో సినిమాలు చేసేందుకు క్యూలో ఉన్నారు. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే నానుడి రాజమౌళి విషయంలో బాగా పని చేస్తుంది. తాను ఎంత పెద్ద సక్సెస్ సాధించినా కూడా తనకు నచ్చిన సినిమాలపై పాజిటివ్‌గా స్పందించడం, తన వారి సినిమాలకు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం చేస్తూ ఉంటాడు.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ఇప్పుడు ఒక బూతు థ్రిల్లర్ సినిమాకు వాయిస్ ఓవర్ చెప్పేందుకు సిద్దం అయ్యాడు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక బూతు థ్రిల్లర్ చిత్రం శ్రీవల్లి. ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఎవరైనా దాన్ని బూతు సినిమా అనే అనుకుంటారు. అందుకే బూతు థ్రిల్లర్ అనడం జరుగుతుంది. ఇలాంటి సినిమాకు రాజమౌళి తన వాయిస్‌ను ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు.
తండ్రి దర్శకత్వం వహించిన సినిమా కనుక రాజమౌళి ఈ పని చేసేందుకు ముందుకు వచ్చాడు. అయితే రాజమౌళికి స్థాయికి తగినది ఆ సినిమా కాదని, ఆ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వకుంటేనే ఉత్తమం అంటూ జక్కన్న ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి ఒక వైపు తన తర్వాత సినిమా గురించి ఆలోచిస్తూనే మరో వైపు ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాడు.
