శ్రీదేవీకి సారీ చెప్పిన రాజమౌళి

శివగామి పాత్రను చేజేతులారా కాలదన్నుకున్నదనే విమర్శలపై ఎట్టకేలకు శ్రీదేవి స్పందించారు. మామ్ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన శ్రీదేవీని ఈ విషయమై ప్రశ్నించగా ఆమె మండిపడింది. ‘ఓ ఆర్టిస్ట్ రెమ్యునరేషన్ గురించి పబ్లిగ్గా మాట్లాడే హక్కు ఏ సినీ దర్శకుడికి, నిర్మాతకు లేదని స్పష్టం చేసింది. బాహుబలియే కాదు.. ఎన్నో హిట్ సినిమాలను తన వ్యక్తిగత కారణాల వల్ల వదులుకున్నాను. అయితే రాజమౌళిలా ఎవరూ నా గురించి విమర్శలు చేయలేదు. ఒక సినిమాను అంగీకరించే హక్కు, తిరస్కరించే హక్కు తనకు లేదా’ అని శ్రీదేవి ప్రశ్నించింది. ఎక్కువ డిమాండ్ పెట్టానన్న రాజమౌళి మాటలు నిజమైతే.. నేను 300 సినిమాలు చేసేదాన్నా అని ప్రశ్నించింది. ఇలా రాజమౌళి తనపై చేసిన విమర్శలకు ధీటుగా బదిలిచ్చి కౌంటర్ ఇచ్చింది శ్రీదేవి.

రాజమౌళి.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ నిర్వహించిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో పాల్గొని నోరు జారారు. శివగామి పాత్ర కోసం శ్రీదేవీ గొంతెమ్మ కోర్కెలు కోరారని.. అందుకే ఆమెను కాదని రమ్యక్రిష్ణను తీసుకున్నామని చెప్పుకొచ్చాడు. శివగామిగా రమ్యక్రిష్ణ జీవించిందని కొనియాడారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నటి శ్రీదేవీ ఎక్కడికి వెళ్లినా మీడియా ప్రతినిధులు ఆమెను ఇదే విషయంపై ప్రశ్నించారు. దీంతో ఎట్టకేలకు శ్రీదేవి రాజమౌళిపై మండిపడింది..

దీనిపై రాజమౌళి మరోసారి తన వ్యాఖ్యలు వివాదం కావడంపై స్పందించారు. ‘శ్రీదేవి, తాను మాట్లాడిన దాంట్లో ఎవరు కరెక్ట్ మాట్లాడారనేది ప్రజలు నిర్ణయిస్తారు.. ఒక్కటి మాత్రం నిజం.. పబ్లిక్ ఫాట్ ఫాంలో ఓ సీనియర్ నటి రెమ్యూనరేషన్ గురించి తాను చర్చించి ఉండాల్సింది కాదు.. అది తన తప్పే.. దీనికి శ్రీదేవికి క్షమాపణలు చెబుతున్నానని ’ రాజమౌళి అన్నారు. శ్రీదేవికి సారీ చెప్పి రాజమౌళి ఈ వివాదానికి ముగింపు పలికారు.

To Top

Send this to a friend