పశ్చాత్తాప పడుతున్న రాజమౌళి

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. ఆ సినిమాలో శివగామి పాత్రలో రమ్యకృష్ణ నటించిన విషయం తెల్సిందే. రమ్యకృష్ణ ఆ పాత్రను అద్బుతంగా పోషించింది. అయితే రమ్యకృష్ణ కంటే ముందు శ్రీదేవిని అడిగినట్లుగా రాజమౌళి మీడియాతో మాట్లాడిన సందర్బంగా చెప్పుకొచ్చాడు. శ్రీదేవి పారితోషికంతో పాటు హోటల్‌ రూమ్స్‌ మరియు విమాన టికెట్లు అంటూ మమ్ముల భయపెట్టింది. అందుకే ఆమెను కాదని రమ్యకృష్ణను సంప్రదించినట్లుగా రాజమౌళి చెప్పుకొచ్చాడు.

రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు శ్రీదేవికి పెద్ద తలనొప్పిని తెచ్చి పెడుతున్నాయి. ఏ మీడియా సమావేశంకు వెళ్లినా కూడా అక్కడ ‘బాహుబలి’ సినిమాను వదులుకున్నందుకు మీరు ఎలా ఫీల్‌ అవుతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. దాంతో చిరాకు తెచ్చుకున్న శ్రీదేవి తాను వదులుకున్న సినిమాల్లో బాహుబలి ఒకటి అంటూ వ్యాఖ్యలు చేసింది.

రాజమౌళిని కించపర్చే విధంగా శ్రీదేవి కాస్త వ్యాఖ్యలు చేసింది. దాంతో వివాదాన్ని ఇక్కడితో ముగించాలనే ఉద్దేశ్యంతో రాజమౌళి తాజాగా తాను శ్రీదేవి గారి విషయంలో చేసిన వ్యాఖ్యలకు పశ్చాతాపపడుతున్నట్లుగా ప్రకటించాడు. అలా మాట్లాడి ఉండకూడదు అంటూ రాజమౌళి వ్యాఖ్యలు చేసి తన సంస్కారంను తెలియజేశాడు. శ్రీదేవి ఇప్పుడు ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.

To Top

Send this to a friend