ఒక్క దెబ్బతో రాజమౌళి ఎక్కడికో వెళ్లిపోయాడు.

 

 

 

 

ఒకే ఒక్క సినిమా దర్శకధీరుడు రాజమౌళి కష్టాలన్నింటిని తీర్చేసింది. కేవలం 15 లక్షల కారుతో అటూ ఇటూ వెళ్లే రాజమౌళి బాహుబలి దెబ్బకు కొత్త కారు కొనేశాడు.. కోటిన్నర పెట్టి ఖరీదైన బీఎండబ్ల్యూ 7 సిరీస్ ను రాజమౌళి కొన్నాడు. ఆయనకు బీఎండబ్ల్యూ కారు తాళాలు ఇస్తున్న కంపెనీ మేనేజర్ ఫొటో విడుదల చేశారు.

బాహుబలి సినిమాతో రాజమౌళి కోటీశ్వరుడు అయిపోయాడు. దాదాపు 1700 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమాకు లాభాల్లో వాటాను తీసుకున్నారు రాజమౌళి.. ఆ వాటాగా జక్కన్నకు కోట్లలోనే సొమ్ము వచ్చిపడింది. అందుకే దాన్ని ఏం చేయాలనే దానిపైనే ప్రస్తుతం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఏదైనా బిజినెస్ లో పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నారు. అంతేకాదు తన కొడుకు కార్తికేయతో కలిసి డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లో భారీగా పెట్టుబడి పెట్టించాలని యోచిస్తున్నాడట..

ప్రస్తుతం రాజమౌళి.. తన కజిన్స్ తో కలిసి హైదరాబాద్ లోని ఓ అపార్ట్ మెంటులో సాదాసీదాగా ఉంటున్నారు. రాజమౌళి అన్నయ్యలు, తమ్ముళ్లు అంతా మ్యూజిక్ డైరెక్టర్లు, గాయకులు, దర్శకులుగా సినిమాలు చేస్తున్నారు. రాజమౌళి ఇన్నాళ్లు అక్కడే ఉన్నాడు. కానీ ఇప్పుడు భారీ ఇంటిని నిర్మించాలని యోచిస్తున్నాడట.. అందుకోసం బంజారా, జూబ్లీహిల్స్ లలో స్థలం కోసం కూడా అన్వేషిస్తున్నట్టు తెలిసింది. మొత్తానికి బాహుబలి సినిమాతో రాజమౌళి తలరాతే మారిపోయింది. ఖరీదైన కారు, కొత్త వ్యాపారాలు ఆయన మొదలుపెడుతున్నాడు.

To Top

Send this to a friend