రాజమౌళి తర్వాతి సినిమా


చాన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్న ఓ ప్రాజెక్టుకు రాజమౌళి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. బాహుబలికి ముందు నిర్మాత కేఎల్ నారాయణ రాజమౌళితో సినిమా చేసేందుకు అడ్వాన్స్ ఇచ్చారట.. మహేశ్ బాబు హీరోగా ఓ కౌబాయ్ సినిమా చేద్దామని అనుకున్నారు. కానీ మధ్యలో బాహుబలి రావడం 7ఏళ్లు అలా గడిచిపోవడం జరిగిపోయాయి. బాహుబలి దెబ్బకు రాజమౌళి దేశంలోనే టాప్ దర్శకుడిగా ఎదిగిపోయాడు.

ఇప్పుడిప్పుడే బాహుబలి సినిమా నుంచి బయటకు వస్తున్న రాజమౌళి తన బకాయి పడ్డ నిర్మాత కేఎల్ నారాయణతో సినిమా చేయడానికి డిసైడ్ అయినట్టు ఫిలింనగర్ సమాచారం. అంతకుముందు డీవీవీ దానయ్య తో ఓ సినిమా అల్లు అర్జున్ హీరోగా తీసి.. ఆ తర్వాత మహేశ్ బాబుతో సినిమా చేయడానికి జక్కన్న ప్లాన్ చేసినట్టు సమాచారం.

ప్రస్తుతం బాహుబలి విజయోత్సాహంతో ఉన్న రాజమౌళి ఫారిన్ లో సెలవులను ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఆ ఓ ఆరు నెలల తర్వాత తన కొత్త సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈలోపు మహేశ్ బాబు-కొరటాల శివ దర్శకత్వంలో సినిమా కంప్లీట్ చేస్తాడు. ఆ తర్వాతనే రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ నటించే అవకాశాలున్నట్టు సమాచారం.

To Top

Send this to a friend