జక్కన్న తర్వాత ప్రాజెక్ట్‌ ఇదే..!


‘బాహుబలి’ సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కించబోతున్న సినిమా ఏంటి, ఆ సినిమా ఎవరితో ఉంటుంది అంటూ ప్రస్తుతం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో రాజమౌళి కథా చర్చల్లో పాల్గొంటూ ఉంటాడని, ఆయన త్వరలోనే తన తర్వాత సినిమాను ప్రకటిస్తాడని అంతా ఆసక్తిగా ఉన్నారు. కాని జక్కన్న తన తర్వాత సినిమాకు కనీసం ఆరు నెలలు అయినా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే జక్కన్న ఇప్పటికే మరో ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టాడు. అదే తన డ్రీమ్‌ ఫామ్‌ హౌస్‌.

రాజమౌళికి చిన్నప్పటి నుండి కూడా ఫాం హౌస్‌లు, పల్లెటూరులు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే జక్కన్న చాలా కాలం నుండి ఒక పెద్ద ఫాం హౌస్‌ను నిర్మించుకోవాలని ప్లాన్‌ చేస్తున్నాడు. అందుకోసం సిటీ శివారు ప్రాంతంలో ఉన్న దొనకొండలో 100 ఎకరాల తోటను రాజమౌళి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. మామిడితో పాటు సపోట చెట్లు ఉన్న ఆ తోటలోనే జక్కన్న ఫాం హౌస్‌ నిర్మాణ పనులు చేపట్టాడు. ప్రస్తుతం రాజమౌళి చేపట్టిన ప్రాజెక్ట్‌ ఇదే. ఫామ్‌ హౌస్‌ పని పూర్తి అయితే ఆ తర్వాత జక్కన్న తన తర్వాత సినిమాను మొదలు పెట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

To Top

Send this to a friend