రాజమౌళి సినిమా


రాజమౌళి బాహుబలి 2 ప్రమోషన్ కు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఈ మేరకు ప్రస్తుతం లండన్ లో ఓ ఫిలిం ఫెస్టివెల్ కి హాజరై బాహుబలి 2 ప్రమోషన్ వర్క్ పూర్తయ్యిందని.. ఇక తాను ఆ సినిమా జోలికి పోనని తేల్చిపారేశాడు. కొద్దిరోజులు అలా అలా ఫారిన్ టూర్లకు వెళ్లి సేదతీరుతానని చెప్పాడు.

మరి రాజమౌళి తన తరువాతి సినిమా ఎవరితో చేస్తాడనే ఉత్కంఠ ఊపేస్తోంది. అప్పట్లో బన్నీ హీరోగా ఓ సినిమా చేసేందుకు ఓ నిర్మాత వద్ద డబ్బులు రాజమౌళి తీసుకున్నాడనే వార్త ప్రస్తుతం ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. అదే నిజమైతే జక్కన్న తీసే తర్వాతి సినిమా అల్లు అర్జున్ తోనే అనడంలో సందేహం లేదు.

ఇక రాజమౌళి ప్రమోషన్ లో భాగంగా రజినీకాంత్ తో కూడా ఓ సినిమా చేస్తానని.. కథ ఓకే అయితే ఆ సినిమా చేయడంలో తనకు అభ్యంతరం లేదని తెలిపారు. ప్రస్తుతం రజినీ శంకర్ దర్శకత్వంలో రోబో 2.0 సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమాపైనే ప్రస్తుతం రజినీ ఆశలన్నీ ఉన్నాయి. ఎందుకంటే రజినీ గత చిత్రాలన్నీ ప్లాప్ అయ్యాయి. కొచ్చాడియన్, కబాలి లాంటి వరుస ప్లాప్ లు రజినీని వెంటాడుతున్నాయి. రోబో 2.0 అయినా హిట్ అయితే రజినీకీ ఊరట… లేదంటే.. మరోసారి నిరాశ తప్పదు.

ప్లాప్ లనుంచి బయటపడేందుకు జక్కన్న రాజమౌళితో సినిమా చేసేందుకు రజినీ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఆయనతో ఎలాగైనా సినిమా తీసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం విజయేంద్రప్రసాద్ ను కథ సిద్ధం చేయమని కోరారని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. ఇదే జరిగితే బాహుబలిని మించిన సినిమా అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

To Top

Send this to a friend