బాహుబలి వల్ల చాలా కోల్పోయా..!


టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ‘బాహుబలి’ కోసం అయిదు సంవత్సరాలు పడ్డ కష్టం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇతర భాష ప్రేక్షకులకు ‘బాహుబలి’ తెలుసు కాని, ‘బాహుబలి’ కోసం రాజమౌళి పడ్డ కష్టం మాత్రం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. అయిదు సంవత్సరాలు అన్ని వదిలేసి మరీ సినిమా కోసం కష్ట నష్టాలను ఓర్చాడు. ఈ అయిదు సంవత్సరాలు పడ్డ కష్టంకు ప్రతిఫలితం అంతకు తగ్గట్లుగానే వచ్చింది. ఈ అయిదు సంవత్సరాల్లో తాను ఎంతో కోల్పోయినట్లుగా జక్కన్న చెబుతున్నారు.

తాజాగా రానా టాక్‌ షోలో పాల్గొన్న రాజమౌళి మాట్లాడుతూ.. అయిదు సంవత్సరాలుగా తాను కుటుంబంకు సరైన టైం కేటాయించలేక పోయాను. సినిమా వల్ల స్నేహితులతో పాటు ఆప్తులకు కూడా దూరంగా ఉండాల్సి వచ్చింది. వారితో క్వాలిటీ టైంను స్పెండ్‌ చేయలేక పోయాను. సినిమా సమయంలో నాకు వారెవ్వరు గుర్తుకు రాలేదు. కేవలం ‘బాహుబలి’ అంటూ అయిదు సంవత్సరాలు అదే ఆలోచల్లో ఉండి పోయాను. ఆ సమయంలో నేను చాలా మిస్‌ అయ్యాను.

ఇప్పుడు ఆ మిస్‌ అయిన సమయంను తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. అందుకే తర్వాత సినిమాకు చాలా గ్యాప్‌ తీసుకోవాలని భావిస్తున్నాను. కుటుంబ సభ్యులతో పాటు అందరికి కూడా ఇప్పుడు దగ్గరగా ఉండి, వారితో టైంను గడుపుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. కనీసం ఆరు నెలల సమయం జక్కన్న తీసుకునేట్లుగా ఆయన మాటలను బట్టి అర్థం అవుతుంది.

To Top

Send this to a friend