రాజ‌మౌళి గ‌త జ‌న్మ తెలుసుకోవాల‌ని ఉందా.. ఇదిగో..    

సెల‌బ్రెటీల గ‌త జ‌న్మ‌లు తెలుపుతూ సంచ‌ల‌నంగా మారుతున్నారు ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వీ నాగనాథ్. గ‌త జ‌న్మ‌లో వారు ఎక్క‌డ ఏ రూపంలో జ‌న్మించారు? ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కున్నారు? ఎలా చ‌నిపోయారు? అనే విష‌యాల‌ను తెలుపుతూ ఎస్వీనాగ్‌నాథ్ చేస్తున్న ప్రొగ్రాం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

గ‌త జ‌న్మ ఆవిష్క‌ర‌ణ
ప్ర‌తి వారం ఒక సెల‌బ్రెటీ గ‌త జ‌న్మ తెలిపే ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వీ నాగనాథ్ తాజాగా స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి పాస్ట్ లైఫ్ ఎపిసోడ్ చేశాడు. జ‌క్క‌న్న‌ గ‌త జ‌న్మ‌ఎలా ఉండేది? గ‌త జ‌న్మ ఎక్క‌డ ఎలా సాగింది? అనే విష‌యాల‌పై నాగనాథ్ చేసిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూ హల్‌చల్ చేస్తోంది.
రాజ‌మౌళి ప్రేమ విఫ‌ల‌మై…
గ‌త జ‌న్మ‌లో రాజ‌మౌళి ప్రేమ విఫ‌ల‌మై దేవ‌దాసులా మారాడ‌ని, అప్ప‌టి జీవితంలో క‌ఠిన ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నాడని ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వీ నాగనాథ్ తెలిపారు. పుష్క‌లంగా టాలెంట్ ఉన్నా దాన్ని వాడుకునేందుకు ముఖ్యంగా ఆర్థిక ప‌రిస్థిలు స‌హ‌క‌రించ‌లేవ‌ని చెప్పారు. రాజ‌మౌళికి ఇక‌ ఒక‌టే జ‌న్మ ఉంద‌ని ఆయ‌న తెలిపారు.

నేను ఎవ‌ర్నీ..?
న‌మ‌స్తే తెలుగు ఛాన‌ల్‌లో హూ ఏమ్ ఐ(who am I) ఎపిసోడ్ ప్ర‌సార‌మ‌వుతోంది. ఇందులో ప్రముఖుల గ‌త జ‌న్మ ర‌హస్యాల‌ను జ్యోతిష్య శాస్త్ర ఆధారంగా చెబుతారు. ఇందులో తాజాగా ప్ర‌సార‌మైన రాజ‌మౌళి పాస్ట్ లైఫ్ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ మారింది.

వైర‌ల్ అవుతున్న ప్రొగ్రాం
సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులంద‌రి పాస్ట్ లైఫ్ ఎపిసోడ్‌ల‌తో ఈ కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని, ప్ర‌తి వారం ఒక ఎపిసోడ్ ప్ర‌సార‌మ‌వుతుంద‌ని ప్రొగ్రామ్ డైరెక్ట‌ర్ స్వామి ముద్దం తెలిపారు. తాజాగా ప్ర‌సారం చేసిన రాజ‌మౌళి పాస్ట్ లైఫ్ వీడియోకు విశేష స్పందన వస్తోందని చెప్పారు. సెల‌బ్రెటీల పాస్ట్ లైఫ్‌ల‌ను ఆవిష్క‌రించే ఇలాంటి కార్య‌క్ర‌మం మీడియా చ‌రిత్ర‌లో తొలిసార‌ని చెప్పారు.

To Top

Send this to a friend