రాజమౌళి లేకుంటే నేను లేను..


బాహుబలిలో కాలకేయ పాత్ర చేసేవరకు కూడా ప్రభాకర్ అని ఒకరున్నారని ప్రపంచానికి తెలియదు. అంతటి గొప్ప పాత్రలో గొప్పగా ఒదిగిపోయి ప్రభాకర్ జీవం పోశాడు. అప్పటికే రాజమౌళి మర్యాదరామన్న పాత్రలో నటింపచేసినా కూడా సరైన గుర్తింపు రాలేదు. కానీ బాహుబలి కాలకేయ పాత్రతో ఇక ప్రభాకర్ వెనుదిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది.

మహబూబ్ నగర్ హస్నాబాద్ కు చెందిన ప్రభార్ సినిమాల్లో నటించాలని అనుకోలేదట.. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానంటే హైదరాబాద్ వచ్చి మోసపోయిన ప్రభాకర్ అన్ని పనులు చేశాడు. ఓ రోజు అతిథి షూటింగ్ కు రాగా అందులో చిన్న పాత్ర చేశాడు. అనంతరం రాజమౌళి దృష్టిలో పడి ఫేమస్ అయ్యాడు.

సినిమాల్లోకి రాకుముందు చాలా అప్పులు చేశాడు ప్రభాకర్ అవన్నీ మర్యాద రామన్న తీశాక ఇచ్చిన రెమ్యునరేషన్ తో తీర్చేశాడట.. ఇక నటన ఏమాత్రం రాకున్నా రాజమౌళి దేవదాస్ కనకాల దగ్గర ఇప్పించిన శిక్షణతో రాటు దేలాడు. నెలకు 10వేల స్టైఫండ్ ఇప్పించి మరీ రాజమౌళి తనకు నటనలో ఓనమాలు నేర్పారని.. చిన్నప్పుడు పడ్డ కష్టాలు రాజమౌళి దయవల్లే ఈ రేంజ్ కు చేరుకున్నానని వినమ్రంగా చెబుతున్నాడీ ప్రభాకర్..

To Top

Send this to a friend