రాజకీయాలతో క్రికెట్ ను భ్రష్టుపట్టించారు…


రాజకీయ నాయకులు క్రికెట్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి భ్రష్టు పట్టిస్తున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఆధిపత్య పోరు హైకోర్టుకు చేరింది. రాజకీయ నాయకులు అధ్యక్ష బరిలో నిలవడం.. మాజీ క్రీడాకారులు కోర్టుకెక్కడంతో దీనిపై తీర్పు ఈరోజు వెలువడింది.. రాజకీయ నాయకులు చేరడంతో హైదరాబాద్ క్రికెట్ పరిధిలో అవకతవకలు, రాజకీయాలు చేరి మెరుగైన క్రీడాకారులు వెలుగులోకి రావడంలేదు. అదే సమయంలో ఈ కుట్రలు కుమ్ములాటల్లో బీసీసీఐ ఇక్కడ క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించడం లేదు. హైదరాబాద్ క్రికెట్ పంచాయతీపై ఈరోజు హైకోర్టు తీర్పునిచ్చింది.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలకు రూట్ క్లియర్ అయ్యింది. HCA అధ్యక్ష ఎన్నికలపై దాఖలైన అన్ని పిటిషన్లను హై కోర్టు కొట్టివేసింది. వెంటనే కౌంటింగ్ నిర్వహించి.. ఫలితాలు ప్రకటించాలని ఆదేశించింది న్యాయస్థానం. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ సలహాదారు వివేక్ తో పాటు.. మాజీ క్రికెటర్ జయసింహ పోటీ పడ్డారు. సెక్రటరీ పదవికి ఏకగ్రీవంగా ఎన్నిక పూర్తయింది. హైకోర్టు ఆదేశాలతో సాయంత్రం లేదా రేపు కౌంటింగ్ పూర్తిచేసి.. ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. జనవరి 17, 2017న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి.

ఇది తెలంగాణ విజయంగా అభివర్ణించారు శేషునారాయణ. ఎంతో కష్టపడ్డామని.. కొందరి వ్యక్తుల వల్లే ఇలా జరిగిందన్నారు. ఇప్పటికైనా న్యాయం జరిగిందన్నారు. కోర్టు ఆదేశాలతో కౌంటింగ్ ప్రక్రియ పూర్తిచేసి.. ఫలితాలు ప్రకటించాలన్నారు.
ఇక HCA ఎన్నికలపై దాఖలైన పిటీషన్లను కొట్టివేసి.. ఫలితాలు ప్రకటించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు మాజీ మంత్రి వినోద్.అవకతవకలు అన్నీ క్లియర్ అవుతాయని.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు మంచి రోజులు వచ్చాయన్నారు.

To Top

Send this to a friend