రైతు ఆందోళన -పట్టించుకోని బాబు


చంద్రబాబు నిద్రపోకుండా 18 గంటలు కష్టపడుతున్నాడబ్బా.. తిన్న తినకున్నా పడుకున్న అవే కలివరింతలు.. అంతటి మహామహుడి పాలనలో ప్రజలు కష్టాలు పడడమా.. నో.. నెవర్ అంటూ టీడీపీ నేతలు చంకలు గుద్దుకుంటున్నారు. బాబు గారు ప్రపంచంలోని అన్ని దేశాలు చుట్టుముట్టి ఏపీకి పెట్టుబడులు తేవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. అయినా కూడా బాబు ఫారిన్ టూర్లపై విమర్శలు, సెటైర్లు తప్పడం లేదే.. హతవిధీ.. బాబు ఏమిటిదీ..

చంద్రబాబు పెట్టుబడుల వేట మొదలుపెట్టారు. అమెరికాకు పెద్ద బృందంతో బయలు దేరివెళ్లారు. అక్కడ యాపిల్, మైక్రోసాఫ్ట్ సహా చాలా కంపెనీలను కలిసి ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానిస్తారట.. కానీ ఇక్కడ మాత్రం ఏపీలో ఆయన పర్యటనను ప్రతిపక్ష వైసీపీ స్వాగతించడం లేదు. మిర్చి రైతులు మద్దతు ధర లేక కడుపు మండి పంటను కాల్చేస్తుంటే.. బాబు విదేశీ పర్యటనలేంటని ప్రశ్నిస్తున్నారు.

సమయం సందర్భానుసారం రాజకీయాలు చేయాలి.. ఓ వైపు ఏపీలో రైతులు మద్దతు ధర లేక రోడ్డెక్కుతున్నారు. సరైన దక్కకపోవడంతో పంటలను మార్కెట్ యార్డుల్లో కాల్చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించిన కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోయేసరికి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు హిందూపురంలాంటి చోట్ల తాగునీటి కోసం మహిళలు నిరసన తెలుపుతున్నారు. అమరావతి రైతులు తమ భూముల పోతాయని కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఇలా రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో ఒక్కో సమస్య ఉంది. రాష్ట్రంలోనే సవాలక్ష సమస్యలుంన్నా.. మళ్లీ చంద్రబాబు ఇవేవీ పట్టించుకోకుండా హైటెక్ సీఎంలా ప్రవర్తించడం విమర్శలకు తావిచ్చింది.

To Top

Send this to a friend