దేవుడు అందరి దూల ఇలా తీర్చేస్తాడు..

అవును తెలుగు సినిమాలోని ఫేమస్ డైలాగ్ ఇదీ.. దేవుడు అందరి దూలా సరైన సమయంలో తీర్చేస్తాడు. క్రికెట్ లో అదే జరిగింది.. వచ్చేది రెయినీ సీజన్.. అందుకే ఇండియాలో జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీని ఇంగ్లాండ్ లో నిర్వహిస్తున్నారు. అగ్రదేశం.. పైగా చూడచక్కని ప్రదేశాలెన్నో ఉండడంతో ఇంగ్లండ్ లో ఆడడానికి అన్ని దేశాలు ఆసక్తి చూపుతాయి. అందుకే వరుసగా రెండో ఏడాది చాంపియన్స్ ట్రోపీ ఇంగ్లాండ్ లో జరుగుతోంది. కానీ వరుణుడు ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీలో ఆట జరగకుండా అడ్డుకుంటు తనే ఆడుతున్నాడు..

పాపం.. ఆస్ట్రేలియా.. గెలుపు వాకిట దురదృష్టం వెంటాడింది. బంగ్లాదేశ్ ను 182 పరుగులకే చాపచుట్టేసిన ఆస్ట్రేలియా 16 ఓవర్లలోనే 83 పరుగులు ఒక్క వికెట్ నష్టానికి చేసి గెలుపు వాకిట ఉంది.. చేతిలో 9 వికెట్లు.. బోలేడె ఓవర్లు.. ఈ నేపథ్యంలో గెలుపు పక్కా అనుకున్నారు. కానీ ఆస్ట్రేలియాను న్యూజిలాండ్ చేతిలో ఓడకుండా అడ్డుకున్న వరుణుడే.. నిన్న ఆస్ట్రేలియా గెలవకుండా అడ్డుకొని బంగ్లాదేశ్ ను ఓటమి బారి నుంచి రక్షించాడు. ఆస్ట్రేలియాను గెలుపు ముంగిట ముంచేశాడు.

ఇలా ఈ రెండు మ్యాచ్ లను రద్దు అయ్యేలా వరుణుడు స్కెచ్ గీశాడు. ఆస్ట్రేలియా జట్టుతో ఆడుకున్నాడు. అందుకే ఇప్పుడు దేవుడు ఆస్ట్రేలియాకు సరిసామాన న్యాయం చేశాడని స్పోర్ట్స్ అనలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. వరుణుడి దెబ్బకు గ్రూప్ ఏలో సమీకరణాలు సంక్లిష్టంగా మారాయి. ఆస్ట్రేలియా సెమీస్ ఆశలు గల్లంతయ్యేలా ఉన్నాయి. రెండు మ్యాచ్ లు రద్దయి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లు సమాన పాయింట్లతో ఉన్నాయి. ఇంగ్లండ్ రెండు పాయింట్లతో గ్రూపులో అగ్రస్థానంలో ఉంది. ఈరోజు ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితంపైనే ఏ జట్టు సెమీస్ చేరుతుందో తేటతెల్లం అవుతుంది.

To Top

Send this to a friend