పవన్ కోసం ఈనాడు, ఆంధ్రజ్యోతి

కమ్మ-కమ్మ ఒకటి, రెడ్డి-రెడ్డికి అనుబంధం, కాపు-కాపులో ఆరాటం.. ఇలా తెలుగు రాష్ట్రాలు కులాల కుంపట్లో ఎప్పటినుంచో కొట్లాడుకుంటున్నాయి. తమ కులం వాడని తేలితే అందలం.. లేదంటే అథ:పాతాళం.. తెలుగురాష్ట్రాల్లో పాతుకుపోయిన బలమైన మీడియా కమ్మ సామాజికవర్గం చేతుల్లో ఉంది. అందుకే ఆనాడు ఎన్టీఆర్ తెరపైకి వచ్చాడు.. 9 నెలల్లో అధికారం కొల్లగొట్టాడు. ఆ తర్వాత తమ మాట వినడం లేదని.. అంతే అవమానకరీతిలో ఈ కమ్మ మీడియా ఆయన్ను సీఎం పీఠం నుంచి దించేసింది. చంద్రబాబును సీఎం చేసి తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంది.

ఇలా మీడియాకు-రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. అది అనాథిగా కొనసాగుతోంది. కానీ ఎప్పుడూ కమ్మ సామాజికవర్గందే ఆదిపత్యం కాదు కదా.. అందుకే మీడియా పెద్దలు మారారు. మొదట్లో యుద్ధం చేసి తరువాత రాజీకొచ్చారు. కేసీఆర్ గద్దెనెక్కగానే కమ్మ మీడియా అధినేతలు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, ఈనాడు అధిపతి రామోజీరావులు కొంత నెగిటివ్ ప్రచారం చేశారు. తెలంగాణ కేసీఆర్ బలమైన వెలమ సామాజికవర్గం కావడంతో ఆయన ముందు ఈ మీడియా ఆటలు సాగలేదు. రాజకీయాల్లో ఆరితేరిన కేసీఆర్ .. ఏకంగా తెలంగాణలో టీవీ9, ఆంధ్రజ్యోతి చానాళ్లను నిషేధించి మొత్తం మీడియాను తన కంట్రోల్ లో తెచ్చుకున్నారు. అనంతరం పలుమార్లు రామోజీరావు-కేసీఆర్, రాధాకృష్ణ-కేసీఆర్ లు భేటి అయ్యి సంధి చేసుకొని ఇద్దరు లాభపడ్డారు. అంటే ఇక్కడ కమ్మ పత్రికాధినేతలు తమ కులపట్టింపును వదిలేసి రాజకీయ ప్రయోజనం.. తమకు అనువైన పరిస్థితుల కోసం మారిపోయారన్న మాట..

ఆ మార్పు వల్లే కమ్మ మీడియా అధినేతలు ఇప్పుడు సామాజికవర్గ కోణంలో నేతలను చూడడం లేదు. కేవలం తమ పత్రికకు, తమకు ఉపయోగపడితే చాలు.. అన్న ధోరణితోనే అడుగులు వేస్తున్నారు. అధికారంలో ఎవరు వస్తే వారికి అనుకూలంగా చేసుకోవడంలో సఫలీకృతం అవుతున్నారు.

ఆ మార్పు ఈనాడు అధిపతి రామోజీరావులో కొట్టొచ్చినట్టు కనపడుతోంది. అందుకే ఆయన అధికారంలో ఉన్న మోడీని, ఇక్కడ కేసీఆర్ కు భజన చేస్తున్నారు. అంతేకాదు.. 2019 ఎన్నికల్లో ఏపీలో కీలకం కాబోతున్న పవన్ ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే పోయిన ఆదివారం ఏకంగా పవన్ యుగ పురుషుడు, దేవుడు అనే రీతిలో ఆదివారం ప్రత్యేకం ప్రచురించింది ఈనాడు పత్రిక.. అందులో పవన్ లోని మంచితనం, ఆదుకునే గుణం, సేవాగుణం, నిరాడంబరత అన్నీ కలగలిపి వండివార్చి బాగా కథనం చేశారు.

ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు రాబోయే రాజకీయ పరిణామాలను అంచనావేయడంలో చాల దిట్టలు.. అందుకే వారిని రాజకీయ మేధావులు అంటారు. ఇప్పుడు పవన్ ను ఫోకస్ చేయడంలో.. ఆయన ప్రతిష్టను పెంచడంలో పత్రిక ద్వారా కృషి చేస్తున్నారు. చానాళ్లలో పవన్ సభలు, సమావేశాలు, ఓదార్పులకు బాగా కవరేజ్ ఇస్తున్నారు. ఈపరిణామాలు చూస్తే ఖచ్చితంగా వచ్చే 2019 ఎన్నికల్లో పవన్ ఏపీలో అధికారంలోకి రావడం ఖాయమనేలా ఉంది. ఎందుకంటే ఏపీలో ఎప్పుడు వైరుధ్యంగా ఉండే కమ్మ సామాజికవర్గ నేతలు.. ఇప్పుడు పవన్ ను కీర్తించడం చూశాక.. ఈ కులాల కుంపట్లు పోయి. . కేవలం తమ స్వార్థ ప్రయోజనాలే రాజ్యమేలుతున్నాయన్న సంగతి ఇక్కడ గమనించాల్సిన విషయం.

To Top

Send this to a friend