మాజీ సీఎం భార్య మళ్లీ గ్లామర్‌ షో

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామికి సినీ పరిశ్రమతో సన్నిహిత సంబంధాలున్నాయి. నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్‌గా ఆయన వ్యవహరించాడు. ఆ సమయంలోనే ఆయన హీరోయిన్‌ రాధికను వివాహం చేసుకున్నాడు. దాదాపు పది సంవత్సరాల క్రితం వీరిద్దరు వివాహం చేసుకోవడం జరిగింది. వివాహం తర్వాత సినిమాలకు రాధిక దూరం అయ్యారు. వీరిద్దరికి ఒక పాప కూడా ఉంది. వీరిద్దరి సంసార జీవితం సాఫీగా సాగుతుందని భావిస్తున్న సమయంలో విడిపోయారు అనే ప్రచారం జరిగింది.

ప్రస్తుతం కుమారస్వామి, రాధికలు విడి విడిగా ఉంటున్నట్లుగా అధికారికంగా వెళ్లడైంది. రాధిక రెండవ పెళ్లి చేసుకోనుంది అనే ప్రచారం కూడా జరిగింది. అయితే అందులో వాస్తవం లేదని ఆమె స్వయంగా మీడియా సంస్థతో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది. ఇక తాజాగా రాధిక మళ్లీ హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇస్తుంది. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఆమెలో అందం ఏమాత్రం తగ్గక పోవడంతో పాటు ప్రేక్షకుల ఇంకా కూడా ఆమె అందాలను కోరుకుంటున్నారు.

అందుకే రాధిక హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. మునుపటి తరహాలోనే ఏమాత్రం బెరుకు లేకుండా గ్లామర్‌గా కూడా నటిస్తాను అంటూ రాధిక చెప్పేసింది. దాంతో కన్నడ ప్రముఖ దర్శకుడు ఈమెకు ఆఫర్‌ ఇచ్చాడు. ఈ చిత్రంతో మళ్లీ పూర్వ వైభవంను ఈమె సాధించాలని భావిస్తుంది. మరి అది వర్కౌట్‌ అయ్యేనా చూడాలి.

To Top

Send this to a friend