రాధాకృష్ణ కోసం కేసీఆర్, బాబు


పత్రికలు తెలుగు రాజకీయాల్ని శాసిస్తున్నాయంటే ఎవ్వరూ నమ్మరు. ఏవేవో కామెంట్లు చేస్తారు. దానికి బలమైన కారణాలు చూపిస్తే కానీ నమ్మరు.. ఇప్పుడు ఆ నిరూపణకు సమయం వచ్చింది. హైదరాబాద్ లోని ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయం రెండు రోజుల క్రితం అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. ఇది ఇలా అంటుకోవడమే ఆలస్యం మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు ఒక్కటేమిటీ ఇలా రోజు చాలామందే వస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా రాధాకృష్ణ తో ఫోన్లో మాట్లాడి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రులు, ఎంపీ సీఎం రమేశ్ ను పంపి సహాయ సహకారాలు అందించినట్టు ఇన్ సైడ్ టాక్. ఇక నిన్న ఏకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా ఆంధ్రజ్యోతి కార్యాలయానికి వచ్చి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.. అరగంట రహస్యంగా ఆంధ్రజ్యోతి కార్యాలయంలో కేసీఆర్-రాధాకృష్ణ మాట్లాడుకున్నారట.. ఏం మాట్లాడారు.. అసలేం జరిగిందనేది మాత్రం రహస్యమే..

ఒకనాటి మిత్రులైన కేసీఆర్, రాధాకృష్ణ ల మధ్య మంచి సంబంధాలున్నాయి. మధ్యలో తెలంగాణ వచ్చినప్పుడు రాధాకృష్ణ… ఆంధ్రజ్యోతి పత్రిక/చానల్ లో కేసీఆర్ కు వ్యతిరేకంగా కథనాలు రాయడం.. కేసీఆర్ తెలంగాణలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ ను నిషేధించడం జరిగిపోయాయి. ఆ తర్వాత చాలా రోజులకు మంత్రి తుమ్మల, ఏపీ సీఎం చంద్రబాబు సహా కొందరు పెద్ద మనుషులు కేసీఆర్-రాధాకృష్ణకు సంధి చేసి ఇద్దరినీ కలిపారు. ఆ కలయికకు కేసీఆర్ నిర్వహించిన చండీయాగం వేదికైంది. ఇక అప్పటినుంచి కేసీఆర్ పై ఆంధ్రజ్యోతి వ్యతిరేక వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.. స్నేహం వెల్లివిరిసింది.

గతంలో రామోజీరావు కూడా తెలుగు రాజకీయాలను శాసించారు. దివంగత ఎన్టీఆర్ ను తెలుగు దేశం స్థాపించిన 9 నెలల్లోనే అధికారం చేపట్టడంలో రామోజీరావు-ఈనాడు పత్రిక కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు అదే పాత్రను ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పోషిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాన సలహాదారు పాత్రను అనధికారికంగా పోషిస్తున్నారు. దాంతో పాటు కేసీఆర్ అస్తానాధీశుడిగా కూడా మారిపోయాడు. అందుకే రాధాకృష్ణకు కష్టం రాగానే కేసీఆర్, చంద్రబాబు వేగంగా స్పందించారు.

ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయం కాలిపోగానే ఆంధ్రజ్యోతి స్టే ట్ బ్యూరో, ఆంధ్రజ్యోతి బ్యూరో ఆఫీసును నడుపుకునేందుకు ఇద్దరు సీఎంలు కేసీఆర్, చంద్రబాబులు చొరవచూపారు. ఖాళీ అయ్యి అమరావతి వెళ్లిపోయిన ఏపీ సచివాలయంలోని డీపీఆర్వో ఆఫీసులో ఆంధ్రజ్యోతి బ్యూరో కార్యాలయానికి కేసీఆర్, చంద్రబాబు అనుమతిచ్చారట.. దీంతో ఇక్కడి నుంచే గత నాలుగు రోజులుగా వార్తలు, విశ్లేషణలు వెళ్తున్నాయి. ఒక పత్రిక కోసం ఇద్దరు సీఎంలు ఇంతలా చొరవచూపడంపై అందరూ ముక్కన వేలేసుకుంటున్నారు. ఏంతైనా తమకు మద్దతుగా నిలిచిన ఆంధ్రజ్యోతి కోసం ఆ మాత్రం చేయడం తప్పుకాదు అన్నట్టు సీఎంలు వ్యవహరిస్తున్నారు.

To Top

Send this to a friend