‘రాధ’ రివ్యూ

చిత్రం : రాధ
బ్యానర్‌ : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
సంగీతం : రాధన్‌
దర్శకుడు : చంద్రమోహన్‌
నిర్మాత : భోగవల్లి బాపినీడు
విడుదల : మే 12, 2017

స్టారింగ్‌ : శర్వానంద్‌, లావణ్య త్రిపాఠి, అక్ష, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, షకలక శంకర్‌, అలీ, సప్తగిరి మొదలగు వారు.

సంక్రాంతికి ‘శతమానంభవతి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న శర్వానంద్‌ తక్కువ గ్యాప్‌తోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాతో వచ్చాడు. ట్రైలర్‌, పోస్టర్స్‌ చూస్తుంటే సినిమా చాలా కలర్‌ ఫుల్‌గా, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఉంటుందని అనిపించింది. ప్రేక్షకుల అంచనాలు పెంచేలా ప్రమోషన్స్‌ చేశారు. నేడు విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది, అంచనాలను అందుకుందా అనేది ఈ రివ్యూలో చర్చిద్దాం.

కథలోకి వెళితే : కథ చాలా రొటీన్‌గానే ఉంది. రాధకృష్ణ(శర్వానంద్‌) కొన్ని కారణాల వల్ల చిన్నప్పటి నుండే పోలీస్‌ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. పోలీస్‌ అయ్యేందుకు క్రిమినల్స్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తూ ఉంటాడు. ఒక పెద్ద నేరస్తుడిని పట్టించి ఇచ్చినందుకు రాధకృష్ణ కోరిక తీర్చుతు పోలీస్‌ ఉన్నతాధికారి ఎస్‌ఐగా నియమిస్తాడు. ఎస్‌ఐగా పోస్టింగ్‌ దక్కినా కూడా క్రిమినల్స్‌ ఎవ్వరు లేని ఒక పోలీస్‌ స్టేషన్‌లో పోయి పడతాడు. పని లేక చిరాకు ఎత్తి రాధ(లావణ్య త్రిపాఠి) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ప్రేమలో మునిగి తేలుతున్న సమయంలోనే హైదరాబాద్‌కు ట్రాన్సపర్‌ అవుతుంది. అక్కడ రాధాకృష్ణకు చేతినిండ పని దొరుకుతుంది. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తుల కుట్రను రాధాకృష్ణ భగ్నం చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేశాడు, చివరకు ఏమైంది అనేది కథ.

నటీనటుల ఫర్ఫార్మెన్స్‌ : శర్వానంద్‌ మంచి నటుడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు సీరియస్‌ రోల్స్‌ను పోషిస్తూ వచ్చిన శర్వానంద్‌ ఈసారి కాస్త విభిన్నంగా కామెడీ రోల్‌ను చేశాడు. గతంలో కాస్త కామెడీని ప్రయత్నించినా కూడా ఈసారి పూర్తిగా మాస్‌ కామెడీ రోల్‌లో శర్వా నటించి మెప్పించాడు. మాస్‌ పాత్రలో అంతకు తగ్గ బాడీ లాంగ్వేజ్‌ మరియు డైలాగ్‌ డెలవరీతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి నుండి ఏ ఒక్కరు కూడా యాక్టింగ్‌ను ఆశించరు. ఆమె నుండి కోరుకున్న గ్లామర్‌ ప్రేక్షకులకు దక్కిందని చెప్పాలి. ఇక మరో హీరోయిన్‌ అక్ష అందాలతో సినిమాను మరింత హీట్‌ఎక్కించింది. తనికెళ్ల భరణి, కోట శ్రీనివాస్‌రావు తదితర మంచి నటులు ఉన్నా కూడా వారికి సరైన ప్రాముఖ్యత దక్కలేదు. ఇతరులు తమ పాత్ర పరిధిలో పర్వాలేదు అన్నట్లుగా నటించి మెప్పించార

సాంకేతికపరంగా: సినిమాలో సాంగ్స్‌ స్పీడ్‌ బ్రేకర్స్‌ను తలపించాయి. ఒకటి రెండు పాటలు మెలోడీయస్‌గా కాస్త అనిపించాయి. కాని పిక్చరైజేషన్‌ మరియు టైమింగ్‌తో పాటలు సినిమాకు పెద్ద మైనస్‌ అన్నట్లుగా ఉన్నాయి. ఒక్క పాట కూడా బాగుంది అన్నట్లుగా అనిపించలేదు. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ గురించి కూడా పెద్దగా చెప్పుకునే విధంగా లేదు. సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది. పలు సీన్స్‌ను కలర్‌ఫుల్‌గా చూపించడంతో పాటు, కొన్ని సీన్స్‌ ఉన్నతిని పెంచడంలో సినిమాటోగ్రఫీ చాలా బాగా పని చేసింది. ఎడిటింగ్‌లో లోపాున్నాయి. పలు సీన్స్‌ డ్రాగ్‌ చేసినట్లుగా, కొన్ని సీన్స్‌ సింక్‌ కానట్లుగా ఉన్నాయి. దర్శకుడు స్క్రీన్‌ప్లే, రచన, దర్శకత్వం విషయాల్లో విఫలం అయ్యాడని చెప్పాలి. ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ కథానుసారంగా పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి.

విశ్లేషణ: శతమానంభవతి వంటి సినిమా తర్వాత శర్వానంద్‌ నుండి అదే స్థాయి సినిమాను ప్రేక్షకులు ఆశిస్తారు. కాని అలా ఆశించిన ప్రేక్షకులు ఈ సినిమా చూసి నిరాశ పడక తప్పదు. అన్ని సినిమాలు ఆ స్థాయిలో ఉండాలి అంటే కష్టమే. తన గత సినిమాలకు కాస్త విభిన్నంగా శర్వానంద్‌ ప్రయత్నం చేశాడు. అతడి ప్రయత్నంను ఒప్పుకోవచ్చు. కాని దర్శకుడు మాత్రం పూర్తి మూస తరహా స్క్రీన్‌ప్లే, పరమ రొటీన్‌ కథాంశంతో ‘రాధ’ను తెరకెక్కించాడు. సినిమాలోని ప్రతి సీన్‌ కూడా గతంలో ఏదో సినిమాలో చూసినట్లుగానే అనిపించింది. కొన్ని కామెడీ సీన్స్‌ ఆకట్టుకున్నాయి. శర్వానంద్‌ నటన, హీరోయిన్స్‌ గ్లామర్‌ కోసం అయినా ఒక సారి సినిమాకు వెళ్లొచ్చు అన్నట్లుగా ఉంది.

ప్లస్‌ పాయింట్స్‌ :
శర్వానంద్‌,
హీరోయిన్స్‌ గ్లామర్‌,
కొన్ని కామెడీ సీన్స్‌,
సినిమాటోగ్రఫీ.

నచ్చనివి :
కథ, స్క్రీన్‌ప్లే,
దర్శకత్వం,
ఎడిటింగ్‌,
సంగీతం.

చివరగా : శర్వానంద్‌ చేసిన ‘రాధ’ ప్రయత్నం బెడిసి కొట్టినట్లే.

రేటింగ్‌ : 2.5/5.0

To Top

Send this to a friend