మ‌ధుమేహం, జీర్ణ స‌మ‌స్య‌లు, ఇన్‌ఫెక్ష‌న్ల‌కు ల‌వంగాల‌తో చెక్‌..!

ల‌వంగాలు… మ‌నం వీటిని వంట‌ల్లో ఎక్కువగా ఉప‌యోగిస్తాం. వీటి వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అవి చాలా ఘాటుగా కూడా ఉంటాయి. అయితే కేవ‌లం వంటలే కాదు, ల‌వంగాల వ‌ల్ల మ‌న‌కు ఆరోగ్య‌ప‌రంగా అనేక లాభాలు క‌లుగుతాయి. వీటితో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ల‌వంగాల్లో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్ గుణాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఇవి నోటి దుర్వాస‌న‌ను పోగొడ‌తాయి. దంతాల‌ను, చిగుళ్ల‌ను దృఢంగా చేస్తాయి. దంత స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తాయి. రోజూ భోజ‌నం చేసిన మూడు పూటలా పూట‌కో ల‌వంగాన్ని నోట్లో వేసుకుని బాగా న‌మిలి మింగాలి. దంతాల నొప్పి ఉన్న వారు ల‌వంగాల‌ను ఇలా తింటే ఫ‌లితం ఉంటుంది.

2. వాంతులు, వికారం వంటి ల‌క్ష‌ణాల‌ను ల‌వంగాలు త‌గ్గిస్తాయి. ల‌వంగాల‌కు కొద్దిగా తేనె క‌లిపి తింటే ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

3. ఆహారం స‌రిగ్గా జీర్ణం కాని వారు భోజ‌నం చేయ‌గానే ఓ ల‌వంగం నోట్లో వేసుకుని న‌మిలితే చాలు. ఆహారం వెంట‌నే జీర్ణ‌మ‌వుతుంది. దీంతోపాటు గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు కూడా దూర‌మ‌వుతాయి.

4. ఒక గ్లాస్ నీటిని పాత్ర‌లో పోసి అందులో ల‌వంగాలు వేసి బాగా మ‌రిగించాలి. అనంత‌రం ఆ నీటిని వేడిగా ఉన్న‌ప్పుడే తాగేయాలి. ఇలా తాగ‌డం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌లు పోతాయి. ఈ నీటిని గొంతులో పోసుకుని పుక్కిలించినా స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

5. మ‌ధుమేహం ఉన్న వారు ల‌వంగాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. 3 పూట‌లా భోజ‌నం చేయ‌గానే 1, 2 ల‌వంగాల‌ను నోట్లో వేసుకుని బాగా న‌మిలి ఆ ర‌సాన్ని మింగేయాలి. దీంతో ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు వెంట‌నే అదుపులోకి వ‌చ్చేస్తాయి. ఇలా ప్ర‌తి రోజూ చేస్తే మ‌ధుమేహం అదుపులో ఉంటుంది.

6. ల‌వంగాల్లో ప‌వ‌ర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. దీంతో ఇన్‌ఫెక్ష‌న్లు రావు. ముఖ్యంగా ఈ కాలంలో వ‌చ్చే వైర‌ల్ జ్వ‌రాల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

7. లవంగాల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా ఉన్నాయి. అందువ‌ల్ల ఇవి కండ‌రాలు, కీళ్ల నొప్పుల‌ను కూడా త‌గ్గిస్తాయి. ల‌వంగాల‌ను నీటిలో వేసి మ‌రిగించి ఆ నీటితో కాప‌డం పెడితే నొప్పులు త‌గ్గుతాయి.

8. ఒక గ్లాస్ పాల‌లో 1/4 టీస్పూన్ ల‌వంగాల పొడి, రాతి ఉప్పు (రాక్ సాల్ట్‌) కలిపి తాగితే త‌లనొప్పి వెంట‌నే త‌గ్గుతుంది.

9. ల‌వంగాల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకుంటే శ‌రీరంలో ఎర్ర ర‌క్త క‌ణాల సంఖ్య పెరుగుతుంది. చ‌ర్మ స‌మ‌స్య‌లు పోతాయి. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది.

10. దుర‌ద‌లు, గాయాలు, పుండ్లు అయిన చోట ల‌వంగాలు, గంధం పొడిల‌ను క‌లిపి పేస్ట్‌లా చేసి అప్లై చేస్తే వెంట‌నే అవి త‌గ్గుతాయి.

11. బాగా దాహం అవుతున్న‌ప్పుడు 1, 2 ల‌వంగాల‌ను నోట్లో వేసుకుని న‌మిలితే అతి దాహం స‌మస్య తీరుతుంది.

To Top

Send this to a friend