అరెస్ట్‌ కాక ముందే పూర్తి చేయాలని..!

టాలీవుడ్‌లో డ్రగ్స్‌ వ్యవహారం ఇప్పుడు ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ వ్యవహారంలో పలువురి పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు నోటీసులు అందుకున్నవిషయం తెల్సిందే. త్వరలోనే వారిని పోలీసులు విచారించేందుకు సిద్దం అవుతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అవుతున్నాయి. విచారణ సమయంలోనే కొందరిని అరెస్ట్‌ చేసే అవకాశం కూడా ఉందనే లీక్‌లు పోలీస్‌ శాఖ నుండి వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా పూరి జగన్నాధ్‌ డ్రగ్స్‌ తీసుకోవడంతో పాటు, పలువురు సెలబ్రెటీలకు డ్రగ్స్‌ను ఇస్తున్నాడని, పలువురు స్టార్స్‌కు ఆయన డ్రగ్స్‌ను అలవాటు చేశాడు అనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఒక వేళ విచారణలో పోలీసులు అనుమానిస్తున్నట్లుగా పూరి సెలబ్రెటీలకు డ్రగ్స్‌ ఇస్తున్నట్లుగా తెలితే వెంటనే అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. పూరి అరెస్ట్‌ అయితే ప్రస్తుతం చేస్తున్న సినిమా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.

ప్రస్తుతం బాలయ్య 101వ చిత్రం ‘పైసా వసూల్‌’ను పూరి తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ చివరి దశలో ఉంది. మామూుగా అయితే 15 రోజుల షూటింగ్‌ ఉంది. కాని విచారణకు హాజరు కాకముందే సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలనేది పూరి ప్లాన్‌గా తెలుస్తోంది. అరెస్ట్‌ కాకుండానే సినిమాను పూర్తి చేస్తే ఇబ్బంది ఉండదని, విడుదల తాను లేకుండా జరిగిపోతుందనేది పూరి ఆలోచనగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

To Top

Send this to a friend