ఇక తనయుడిపై ఫోకస్‌


టాలీవుడ్‌లో చాలా స్పీడ్‌గా సినిమాలు తెరకెక్కిస్తాడనే పేరున్న పూరి జగన్నాధ్‌ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ 101వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. రెండు నెలల క్రితమే ప్రారంభం అయిన బాలయ్య ‘పైసా వసూల్‌’ చిత్రం మరి కొన్ని రోజుల్లోనే పూర్తి చేయబోతున్నాడు. కేవలం మూడు నాలుగు నెలల్లోనే సినిమాలను పూర్తి చేయగల సత్తా ఉన్న దర్శకుడు పూరి జగన్నాధ్‌ తన తర్వాత సినిమాను కొడుకుతో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

పూరి జగన్నాధ్‌ తనయుడు ఆకాష్‌ పూరి పలు చిత్రాల్లో బానటుడిగా నటించాడు. చిన్నపటి నుండి కూడా నటనపై ఆసక్తి ఉండటంతో ఆకాష్‌ హీరో అవ్వాలని కోరుకుంటున్నాడు. ఇప్పటికే రెండు చిత్రాల్లో హీరోగా నటించి తన అదృష్టంను పరీక్షించుకున్న ఆకాష్‌కు సరైన సక్సెస్‌ దక్కలేదు. ప్రస్తుతం థాయ్‌లాండ్‌ మరియు బ్యాంకాక్‌లలో యాక్షన్‌ సన్నివేశాలకు సంబంధించిన ట్రైనింగ్‌ను తీసుకుంటున్నాడు. యుద్ద విద్యలు మరియు ఫైటింగ్‌లకు సంబంధించి మెళుకువలు నేర్చుకుంటున్నాడు. ఇక అమెరికాలో ఇప్పటికే సంవత్సరం పాటు నటనలో మరియు దర్శకత్వంలో శిక్షణ పొందాడు.

కొడుకును ఒక పక్కా మాస్‌ హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందు నిలిపేందుకు పూరి ప్రయత్నాలు చేస్తున్నాడు. ‘పైసా వసూల్‌’ చిత్రం విడుదలైన తర్వాత రెండు లేదా మూడు నెలల పాటు కూర్చుని తనయుడి కోసం మంచి స్క్రిప్ట్‌ను సిద్దం చేయాలని భావిస్తున్నాడు. మొదటి సినిమాతోనే ఆకాష్‌ స్థాయి అమాంతం పెరిగేలా భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని తెరకెక్కించాలని భావిస్తున్నాడు. అందుకు తానే నిర్మాతగా మారాలని లేదా తన సన్నిహితులకు నిర్మాణ బాధ్యతలను అప్పగించాలని పూరి భావిస్తున్నాడు.

To Top

Send this to a friend