సినిమాల్లోకి పూరి కూతురు..

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ తనయుడు ఆకాష్‌ పూరి ఇప్పటికే బాల నటుడి స్థాయి నుండి హీరో స్థాయికి పెరిగి పోయిన విషయం తెల్సిందే. ‘ఆంధ్రాపోరీ’ చిత్రంతో ఆకాష్‌ హీరోగా మారిపోయాడు. ఇప్పుడు పూరి తనయ పవిత్ర కూడా సినీ రంగ ప్రవేశం చేయాలని ఆశిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. గతంలో పలు చిత్రాల్లో బా నటిగా నటించిన పవిత్ర ప్రస్తుతం బాలయ్య 101వ సినిమాకు సహాయ దర్శకురాలిగా పని చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

పవిత్రకు దర్శకత్వంపై చాలా ఆసక్తి. అందుకే వేసవి సెలవుల కారణంగా సహాయ దర్శకురాలిగా తండ్రి వద్దే పవిత్ర పని చేస్తున్నట్లుగా చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బాలయ్య సినిమా ఎక్కడ షూటింగ్‌ జరిగినా అక్కడ పవిత్ర ప్రత్యక్షం అవ్వడం, అక్కడ చిన్న చిన్న పనులు ఆమె చేస్తుండటం కనిపిస్తుంది. దాంతో పవిత్ర అసిస్టెంట్‌ దర్శకురాలిగా చేస్తుందని అంటున్నారు. అయితే మరి కొందరు మాత్రం పూర్తి విభిన్నమైన కోణంలో ఆలోచిస్తున్నారు.

పూరి కూతురు పవిత్రకు హీరోయిన్‌ అవ్వాలనే కోరిక చాలా కాలంగా ఉందట. అందుకే నటనలో ఓనమాలు నేర్చుకునేందుకు పవిత్ర సినిమా షూటింగ్‌కు వచ్చినట్లుగా అంచనా వేస్తున్నారు. మొత్తానికి పవిత్ర ఏంటి, ఆమె ఏం చేయబోతుంది అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

To Top

Send this to a friend