సోదిలో లేని జట్టది.. ఐపీఎల్ ఫైనల్ చేరింది..

ఐపీఎల్ ఫైనల్ చేరినప్పుడు పుణెను ఎవ్వరూ అంచనా వేయలేదు. ఎందుకంటే ఆ జట్టు గడిచిన సారి ఐపీఎల్ లో చివరి స్థానంలో నిలిచింది. ధోని ఉన్నా ఆ టీం తలరాత మారలేదు. కానీ ఈసారి సీజన్ లో దశమారింది. 15కోట్లు పెట్టి కొన్న ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ అంచనాలకు మించి రాణించాడు. తనపై పెట్టిన సొమ్ముకు న్యాయం చేశాడు. అద్భుతమైన బౌలింగ్, బ్యాంటింగ్ తో ఫుణెను సెమీఫైనల్ వరకు తీసుకొచ్చాడు. కానీ సెమీఫైనల్ లో మాత్రం అతడు దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లు ఉండడంతో ఇంగ్లండ్ వెళ్లిపోయాడు..

కానీ అతడు రగిల్చిన కసి, గెలుపు తపనను పుణె ఆటగాళ్లు కొనసాగించారు. ఐపీఎల్ ఫైనల్ చేరేందుకు ఉన్న ఏకైక క్వాలిఫైయర్ 1 పోటీల్లో పటిష్ట ముంబైను ఓడించి పుణెను ఫైనల్ చేర్చారు. ఇందులో రహానె, మనోజ్, ధోనీ బాధ్యతాయుత బ్యాటింగ్ తో స్కోరు చేయగా.. అద్భుతమైన బౌలింగ్ తో 17ఏళ్ల యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు తీసి ముంబైని 9 వికెట్లకు 142 పరుగులకే పరిమితం చేశాడు.

సొంతగడ్డలో జరిగిన మ్యాచ్ లో ముంబై పుణె చేతుల్లో విలవిల్లాడింది. ఫుణె తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. రహానె 56,మనోజ్ తివారీ 58, ధోని 40 నాటౌట్ రాణించారు. అనంతరం బ్యాంటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ పుణె బౌలర్ల ధాటికి కుదేలైంది. పార్థీవ్ 52 పరుగులతో పోరాడినా అతడికి సహకారం అందించే వారు కరువయ్యారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులకే పరిమితమైంది. దీంతో అంచనాల్లేకుండా వచ్చిన జట్టు ఫైనల్ చేరి ఐపీఎల్ లో సంచలనం సృష్టించింది.

To Top

Send this to a friend