ఎలర్జీల నుంచి రక్షణ పొందండి..


మన చుట్టూ ఎన్నోరకాల సూక్ష్మజీవులున్నాయి. ఈ సూక్ష్మ పదార్ధాలు , రసాయనాలు , పుప్పొడిరేణువులు , ధూళి, దుమ్ము వంటివి గాలి , నీరు , బట్టలు , ఆహారపదార్ధములు ద్వారా వచ్చి మనకు చేరుతాయి లేదా తాకుతాయి . వీటన్నిటిమీద తగిన చర్య చూపుతూ శరీరము , వ్యాధినిరోధక వ్యవస్థ తనను తాను రక్షించుకుంటుంది . అయితే వీటిలో కొన్నింటిమీద కొందరి శరీరాలు చూపే ప్రతిచర్యలు తీవ్రముగా ఉంటాయి . అదే ఎలర్జీ.

అలర్జీ సోకితే ఉన్నట్లుండి గొంతు గరమంతుంది , మరుసటి రోజు ముక్కునుండి నీరు రావటం ప్రారంభమై జలుబు చేస్తుంది . మరొ కరికి హఠాత్తుగా కళ్లు ఎర్రబడి నీరుకారడం ప్రారంభమవుతుంది . మరొకరికి కారణం లేకుండా ఒళ్ళు వెచ్చబడి ఆయాసంగా ఉంటుంది . శ్వాస వదిలేటప్పుడు పిల్లికూతలవంటి శబ్దం వస్తూ ఉంటుంది . ఇంకొకరి హఠాత్తుగా కాళ్ళు , చేతులు వేళ్ళ మధ్య దురద ప్రారంభమవుతుంది . ఇవన్నీ ఒకే కారణం వల్ల వస్తాయి … అదే అలర్జీ అంటారు. . ఏ మనిషిలోనైన అలర్జీ కలిగించే పదార్థాలను అలర్జెన్స్‌ అంటారు.

ఇవి అందరిలో ఒకేలా ప్రభావము చూపవు . ఒక్కొక్కరికి ఒక్కో పదార్ధము పడకపోవచ్చును . శరీరము ఎలర్జెన్‌ లకు స్పందించినప్పుడు ” హిస్టమిన్‌” అనే పదార్ధము పుడుతుంది . దీని ప్రభావము వల్ల చర్మము మీద మంట , దురద , దద్దుర్లు , శ్వాస సరిగా ఆడకపోవడం వంటి ఇబ్బందులు కలుగుతాయి.

అలర్జీ రాకుండా ఉండాలంటే ఎలర్జీని కలుగజేసే పరిసరాలకు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎలర్జీ లక్షణాలకు వివిధ మందులు వేసుకోవాలి. శరీర సహజ వ్యాధినిరోదక శక్తిని పెంచుకోవాలి. శీతల పానియాలు, చల్లటి పదార్థాలు మానివేయాలి. దుమ్ము, ధూళి పరిసర ప్రాంతాలలోకి వెళ్లుకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఒక వేళ వెళ్లాల్సి వస్తే మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.

To Top

Send this to a friend