మసాజ్ లో వ్యభిచారం.. సినీ ఆర్టిస్టుల ప్రమేయం..

హైదరాబాద్ లో మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచారం చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. థాయిలాండ్, మకావు దేశాల్లో చేసే మసాజ్ వ్యభిచారాన్ని బేస్ చేసుకొని అక్కడి వారిని రప్పించి సిద్దార్థ్ అనే హైదరాబాదీ వ్యక్తి ఈ మసాజ్ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో సిద్ధార్థ్ ని అరెస్ట్ చేసి విచారించగా ఇందులో డ్రగ్స్ తీసుకొని మసాజ్ వ్యభిచారం చేయిస్తామని.. కొంత మంది సీనీ ఆర్టిస్టులు కూడా ఈ వ్యభిచారం ముఠాలో ఉన్నట్టు అతడు వెల్లడించడం కలకలం రేపింది.

ఈ మసాజ్ వ్యభిచారంలో ఓ రియాల్టీ షోలో పాల్గొని వచ్చిన ఓ సినీ ఆర్టిస్టు పేరును సిద్ధార్థ్ వెల్లడించినట్టు సమాచారం. ఆమెతో పాటు కొందరు టీవీ, సినీ జూనియర్ ఆర్టిస్టులు కూడా ఈ మసాజ్ వ్యభిచారం ముఠాలో ఉన్నట్టు పేర్లు చెప్పినట్టు తెలిసింది. ఓ నటి అయితే వ్యభిచార కేసులో అరెస్ట్ అయ్యిందని.. ప్రతి రెండు నెలలకోసారి అమ్మాయిలను విదేశీ టూర్లకు పంపించి అక్కడ వ్యభిచారం చేయిస్తూ నెలకు కోటి రూపాయల వరకు ఆదాయం సమకూరుస్తోందని సిద్ధార్థ్ చెప్పినట్లు తెలిసింది. ఇక పట్టుబడిన థాయ్ లాండ్, మకావ్ దేశాల యువతును వారి స్వగ్రామాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

To Top

Send this to a friend