బిగ్ బాస్ లో మొదటి ముద్దు ఇచ్చేశాడు..

బిగ్ బాస్ లో ఫస్ట్ టైం రోమాంటిక్ సన్నివేశం కనిపించింది. నిన్నరాత్రి జరిగిన 18వ రోజు ఎపిసోడ్ లో కెప్టెన్ కం హీరో ప్రిన్స్ ఇటీవలే వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ దీక్షకు ముద్దు ఇవ్వడం సంచలనమైంది. ఈ ముద్దు ముచ్చట లైవ్ లో అందరూ చూస్తుండగా.. ఇచ్చేసరికి అందరూ ముక్కున వేలేసుకున్నారు.

బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన దీక్ష పై ఫుల్ ఫోకస్ పెట్టాడు ప్రిన్స్. ఒకవైపు కెప్టెన్ గా వ్యవహరిస్తూనే వీలు చిక్కినప్పుడల్లా దీక్షకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు.. అర్చన, ముమైత్ హరితేజలు దీక్ష పనిచేయడం లేదని కెప్టెన్ ప్రిన్స్ కు కంప్లైట్ చేశారు. దీంతో ప్రిన్స్ దీక్ష దగ్గరకు వెళ్లి నువ్ ముమైత్ కు పనిలో సాయం చేయాలని.. నీపై అందరూ కంప్లైట్ చేశారని.. దీనిపై అలిగిన దీక్ష నేను పనిచేస్తున్నా చేయడం లేదంటున్నారని.. రాజకీయాలు చేస్తున్నారని ఏడుపు లఖించింది. ఒప్పో పైసా వసూల్ టాస్క్ లో పాయింట్లు పంచుకునే విషయంలో దీక్షకు తక్కువ ఇవ్వడంపై ఆమె అడగడం.. మిగతా సభ్యులు ఇవ్వకపోవడంతో ఆమె ఏడుపు మొదలెట్టింది.

దీక్షను కెప్టెన్ ప్రిన్స్ ఓదార్చుతున్నట్టే చేసి ముద్దు పెట్టుకోవడం బిగ్ బాస్ హౌస్ లోని అందరిని ఆశ్చర్యపరిచింది. ఏం చేస్తున్నావ్ ప్రిన్స్ అంటూ దీక్ష అడగగా.. తాను ఓదార్చుతున్నానని.. చిన్నగా ముద్దు పెడితే తప్పులేదంటూ తప్పించుకున్నాడు. మొత్తానికి ఈ ఫస్ట్ కిస్ తో ప్రిన్స్ దీక్షపై కన్నేశాడని అర్థమవుతోంది..

To Top

Send this to a friend