నాకు మోడీ అంటే నచ్చదు… అయినా..

పగవాడు పెద్ద సీట్లో ఉన్న సెల్యూట్ చేయాల్సిందే.. నచ్చనివాడు పరిపాలకుడు అయినా భరించాల్సిందే.. రాజకీయాల్లో శత్రువులు, మిత్రులు కలిసి పనిచేయాల్సిందే.. అది తప్పదు.. దేశ అత్యున్నత పీఠాలైన రాష్ట్రపతి, ప్రధానమంత్రి పదవుల్లో బద్ధ శత్రువులున్నా సర్దుకుపోవాల్సిందే.. అదే విషయం ఢిల్లీ వేదికగా మరోసారి నిరూపితమైంది..

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ఈనెల 12తో ముగుస్తుంది. ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీపై రాసిన ‘ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ-ఏ స్టేట్స్ మెన్’ అనే పుస్తకావిష్కరణ సభ ఢిల్లీలో జరిగింది. దీనికి ప్రధాని కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎలాగూ మరో వారంలో దిగిపోతున్నా కదా అని రాష్ట్రపతి ప్రణబ్ సంచలన వ్యాఖ్యలు చేశారు..

‘ప్రధాని నరేంద్రమోడీ అంటే నాకు నచ్చదు.. మోడీకి, నాకు మధ్య అభిప్రాయాల బేధాలున్నాయి. అది నేను కాంగ్రెస్, ఆయన బీజేపీ సీఎంగా ఉన్నప్పటినుంచే ఉన్నాయి. అయినా మేమిద్దరం రాష్ట్రపతి, ప్రధానులుగా పీఠమెక్కాక భేదాభిప్రాయాలను మాతోనే ఉంచుకొని పరిపాలించాం. అందువల్ల మా సంబంధాలపై ప్రభావం చూపడం లేదు’ అని ప్రణబ్ మాట్లాడారు…

దీన్ని సృహద్భాద సూచనగా తీసుకున్న ప్రధాని మోడీ అనంతరం మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. సీనియర్ నాయకులు ప్రణబ్ తో కలిసి పనిచేయడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రణబ్ లో ఎన్నో మానవీయ కోణాలున్నాయి అందుకు మనం గర్వపడాలి అని వ్యాఖ్యానించి విమర్శలపై సానుకూలంగా స్పందించారు.

To Top

Send this to a friend