అమెరికా అధ్యక్షుడికి అవమానాల పరంపర..

 
పాపం.. ఆయన అగ్రరాజ్యానికి అధ్యక్షుడైన తర్వాత ఏదీ కలిసి రావడం లేదు. ఇంట్లో పెళ్లాం పోరు.. బయట గౌరవ మర్యాదల లేమి డోనాల్డ్ ట్రంప్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏ పర్యటనకు వెళ్లినా ఏదో ఒక అవమానం అమెరికా అధ్యక్షుడికి జరుగుతూనే ఉంది.

 
తాజాగా పోలండ్ లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడికి అక్కడ అనుకోని రీతిలో అవమానం ఎదురైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాగానే పోలండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. పనిలో పనిగా ఆయన భార్య అగతా దుడాతోనూ చేతులు కలిపేందుకు ప్రయత్నించగా ఆమె ట్రంప్ కు ఇవ్వకుండా ఆయన భార్య మెళానియాకు షేక్ హ్యాండ్ ఇచ్చింది.. ఈ హఠాత్ పరిణామంతో షాక్ అయిన ట్రంప్ ముఖం వాడిపోయింది. అనంతరం అగతా అమెరికా అధ్యక్షుడిని చూసి వెనక్కి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చింది.
 

ఈ మొత్తం వ్యవహారం వీడియోల్లో ప్రసారం కావడం.. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రంప్ అభాసుపాలయ్యారు. ఆ తర్వాత పోలెండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ మీడియా ముందుకు వచ్చి తన భార్య ట్రంప్ ను పట్టించుకోలేదంటూ వస్తున్న వార్తలు నిజం కావని ఖండించారు. కానీ జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది. ట్రంప్ పరువు మరోసారి పోయింది.
ట్రంప్ కు షేక్ హ్యాండ్ ఇవ్వని పోలెండ్ భార్య వీడియోను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend