ప్రేమ, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా.. శ్రీనువైట్ల మారవా.?


శ్రీనువైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం మిస్టర్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి, హెబా పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా షూటింగ్ ఫినిష్ చేసిన శ్రీనువైట్ల అంతే సైలెంట్ గా బుధవారం టీజర్ ను రిలజ్ చేశారు. రెండు నిమిషాల నిడివిగల ట్రైలర్ ను విడుదల చేశారు. మొత్తం ట్రైలర్ చూస్తే ప్రేమ, దాంతో యాక్షన్, ఆ తర్వాత కొంచెం ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా కనిపించింది..

శ్రీనువైట్ల మూసకామెడీ కథలతోనే హిట్ దర్శకుడినుంచి ప్లాప్ కు మారాడు. మహేశ్ బాబుతో దూకుడు తీసి ఆ తర్వాత మరోసినిమాను అలానే తీసి ప్లాప్ ఇచ్చారు. మూస కామెడీ తీస్తుండడంతో ఆయనతో సినిమాలు చేసేందుకు అగ్రనటులు ముందుకు రావడం లేదు. అందుకే ఈసారి ఆయన ఓ కథతో మెగా ఫ్యామిలీ నుంచి ఉన్న వరుణ్ తేజ్ ను హీరోగా పెట్టి సినిమా తీశారు. విదేశాల్లో హెబ్బా పటేల్ తో ప్రేమాయణం చేసిన హీరో ఆ తర్వాత ఇండియాకు వచ్చి ఇక్కడ మరో హీరోయిన్ లావణ్యతో ప్రేమ, యాక్షన్, ఆ తర్వాత కుటుంబ సంబంధాలున్నట్టు ట్రైలర్ లో చూపించారు. అంటే ఇందులో కూడా కొత్తదనం లేదని నిరూపితమైంది. శ్రీనువైట్ల ట్రైలర్ చూశాక.. సినిమాపై హైప్ కన్నా నెగిటివ్ రెస్పాన్సే ఎక్కువ వచ్చింది. ఇప్పటికైనా శ్రీనువైట్ల కొత్తదనం కోసం పరితపిస్తే ఆయనకూ.. ఇండస్ట్రీకి మంచిది.

To Top

Send this to a friend