జులై 1న‌ `ప్రేమ‌లీల‌..పెళ్లి గోల` విడుద‌ల‌

ఇటీవ‌ల త‌మిళ్ లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన `వెల్లై కార‌న్` చిత్రాన్ని `ప్రేమ‌లీల‌-పెళ్లి గోల` టైటిల్ తో మ‌హా వీర్ పిలిమ్స్ అధినేత‌ నిర్మాత పార‌స్ జైన్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. విష్ణు విశాల్, నిక్కీ గ‌ల్రానీ నాయ‌కానాయిక‌లుగా న‌టించారు. ఎళిల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని జులై 1న రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా

శ్రీ మ‌హావీర్ ఫిలింస్ అధినేత, నిర్మాత పార‌స్ జైన్ మాట్లాడుతూ ` ప్రేమ‌లీల ఒకరిది. పెళ్ళి గోల మ‌రొక‌రిది. అదే ఈ సినిమా క‌థ‌. కామెడీ..ల‌వ్ ..ఎమోష‌న్స్ అన్నీ అంశాల‌తో ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ గా తెర‌కెక్కింది. మాతృక‌లో సినిమా పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఇప్పుడు తెలుగు లో ఆ స్థాయి విజ‌యాన్ని అందుకుంటుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. తొలి కాపీ సిద్దమైంది. సినిమా చూసిన వాళ్లంతా ఆద్యంతం క‌డుపుబ్బా న‌వ్వుకునే సినిమా అని ప్ర‌శంసించారు. ముఖ్యంగా ద్వితియార్థంలో సాగే కామెడీ హైలైట్ గా ఉంటుంది. జులై 1న సినిమా విడుద‌ల‌ చేస్తున్నాం` అని అన్నారు.

చిత్ర హీరో విష్ణు విశాల్ మాట్లాడూతూ `ఐటీ ఉద్యోగం చేసుకుంటోన్న స‌మ‌యంలో త‌మిళ్ సినిమాల్లో అవ‌కాశం రావ‌డంతో హీరోగా ట‌ర్న్ అయ్యా. `వెన్నైలా క‌బాడీ కుజు` (`భీమిలి క‌బ‌డ్డి జ‌ట్టు`) చిత్రం నాకు మంచి గుర్తింపునిచ్చింది. ప్ర‌స్తుతం కొన్ని సినిమాల‌తో బిజీగా ఉన్నా. ఇటీవ‌ల విడుద‌లైన `వెల్లై కార‌న్` చిత్రం మంచి బ్రేక్ నిచ్చింది. త‌మిళ్ లో పెద్ద హిట్ అయింది. జులై 1న తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాం. అంద‌రూ త‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.

To Top

Send this to a friend