బాబోయ్‌.. ఏంటి ఈ బిజినెస్‌లు?


ఒక సినిమాను నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఏరియాల వారిగా బిజినెస్‌ చేసేవారు. సినిమాపై ఉన్న అంచనాలు, ఆ హీరో, దర్శకుడిపై ఎంత పెట్టవచ్చు అనే లెక్కలు వేసుకుని డిస్ట్రిబ్యూటర్లు సినిమాను కొనేందుకు ముందుకు వచ్చేవారు. అయితే ఇదంతా కూడా గతం. ఇప్పుడు అంతా పద్దతి మారిపోయింది. సినిమా చిత్రీకరణలో ఉన్న సమయంలోనే, ఇంకా కొన్ని సినిమాలు షూటింగ్‌ కూడా ప్రారంభం కాకుండానే అమ్ముడు పోతున్నాయి. స్టార్‌ హీరోల సినిమాలు భారీగా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేస్తున్నాయి. సినిమాపై వచ్చిన అంచనాలను క్యాష్‌ చేసుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారు.

ఈ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కారణంగా స్టార్‌ హీరోతో సినిమాలు నిర్మిస్తే నష్టాలు అనేవి ఉండవని నిర్మాతలు భావిస్తున్నారు. ఎందుకంటే పెట్టిన పెట్టుబడి కంటే కూడా అధికంగా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగి పోతుంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘డీజే’ చిత్రం 50 కోట్లతో తెరకెక్కి దాదాపుగా 85 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది. ఇక పవన్‌, త్రివిక్రమ్‌ల చిత్రం 60 కోట్లతో తెరకెక్కుతుంది. 150 కోట్ల ప్రిరిలీజ్‌ బిజినెస్‌ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఎన్టీఆర్‌ జై లవకుశ చిత్రం 50 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొంది ఏకంగా 120 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ను చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక గౌతమ్‌నంద చిత్రం 35 కోట్లతో తెరకెక్కి 50 కోట్ల బిజినెస్‌ను చేసింది. ఇలా అంచనాలు భారీగా ఉన్న సినిమాలు అన్ని కూడా డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తంను పెట్టి కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ఆ సినిమా సక్సెస్‌ అయితే పర్వాలేదు. లేదంటే డిస్ట్రిబ్యూటర్లు కోట్లు లాస్‌ అవ్వాల్సిందే. నిర్మాతలు మాత్రం నష్టం లేకుండా బయట పడతారు.

To Top

Send this to a friend