ప్రత్యర్థులకు ఎందుకంత నిరాశ..?


నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు చంద్రబాబు అనుకూల మీడియా ఒకటే అనుమానపు రాతలు, విశ్లేషణలు.. జగన్ బెయిల్ ను కోర్టు రద్దు చేస్తే వైసీపీ పరిస్థితి ఏంటీ.? చంద్రబాబుకు ఎంత లాభం..? విజయమ్మ నాయకత్వం వహిస్తుందా.? 2019 ఎన్నికలకు ఎవరు వైసీపీ స్టార్ క్యాంపెయినర్ ఇలా అన్ని లేని ప్రశ్నలను జోడించి చంద్రబాబు అనుకూల యెల్లో మీడియా కథనాలను వండివార్చింది.

కానీ ప్చ్ ఏం చేస్తాం.. కోర్టు జగన్ బెయిల్ రద్దు పిటీషన్ ను కొట్టివేయలేదు. పైగా జగన్ కు న్యూజిలాండ్ కు వెళ్లడానికి సమ్మర్ హాలీడే స్ కింద 15 రోజుల సెలవిచ్చింది. ఈ పరిణామాలు యెల్లో మీడియాకు, చంద్రబాబు అనుకూలుర గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టు అయ్యింది..

జగన్ ఎప్పుడు జైలు కు పోతాడా.? ఎప్పుడు ఏపీలో తమకు ప్రత్యామ్మయం లేకుండా పోతుందా అని యెల్లో మీడియా కన్న కలలు నిన్న కోర్టు తీర్పుతో పటాపంచలయ్యాయి. జగన్ కోర్టుకు ప్రశాంతంగా రావడం.. బెయిల్ రద్దును కోర్టు కొట్టివేయడంతో జగన్ మందహాసంతో తిరిగి వెళ్ళటం ప్రత్యర్థులు రగిలిపోతున్నారు. అందివచ్చిన అవకాశం చేజారిపోయిందేమోనని తెగ బాధపడుతున్నారట.. అందుకే జగన్ బెయిల్ రద్దు వార్తను ఎక్కడా పెద్దగా హైలెట్ చేయకపోవడం ఈరోజు విశేషం..

To Top

Send this to a friend