ప్రతీదీ పండుగే కేసీఆర్ కు..


తెలంగాణ సీఎం కేసీఆర్ లో ఆదినుంచి ఉద్యమ భావాలు ఎక్కువ.. నా తెలంగాణ ,  సంస్కృతి సంప్రదాయాలకు ఎక్కువ విలువనిస్తారు. తెలంగాణ కోసం శ్వాసిసస్తారు.. జీవిస్తారు.. అందరూ బాగుండాలని కోరుకుంటారు. ఇంటికి ఎవ్వరూ వచ్చినా మాంచి నాన్ వెజ్ రుచులను వడ్డిస్తారు. వారి కడుపు చల్లన చేసి పంపిస్తారు. అది మిత్రులైనా.. శత్రువులైనా.. కేసీఆర్ ఇంటికొచ్చిన వారిని ఆదరిస్తారు.. అభిమానిస్తారు..

ఆదినుంచి కేసీఆర్ లో ఇదే భావన ఉంది. పార్టీ కార్యక్రమమైనా.. ప్రజల వేడుకైనా దాన్ని నిండుగా పూర్తిగా చేసుకోవడం కేసీఆర్ కే చెల్లింది. ఇది ఆయన వ్యక్తిగత అభిరుచి.. అందుకే ఆ అభిరుచిని పార్టీకి కూడా అలవాటు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా ప్రతి ఏప్రిల్ లోనూ కేసీఆర్ దీన్ని కొనసాగిస్తారు..

ఏప్రిల్ లో నిర్వహించే టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ అధ్యక్షుడిని ప్రతీ ఏటా ఎన్నుకుంటారు. ఈ సందర్భంగా కేసీఆర్ తమ పార్టీ సర్పంచ్ లనుంచి మంత్రుల వరకు అందరీనీ ఒకే వేదిక వద్దకు ఆహ్వానిస్తారు. ఈ సభకు వచ్చిన నాయకుల కోసం తెలంగాణ, ఇండియా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రుచికర భోజనాలను వడ్డిస్తారు. గొర్రె, మేక, చేపలు, కోళ్లు, రొయ్యలు, పీతలు, శాఖాహార వంటలు ఇలా ఓ 30 రకాలుగా వడ్డిస్తారు. ఈ అరుదైన భోజనంబును అందరూ లొట్టలేసుకొని తింటారు. పార్టీ కోసం అంత కష్టపడుతున్న తమ నాయకులకు మంచి బోజనం అందించడంలో తప్పు లేదని.. అందరూ కడుపునిండా తిని వెళ్లాలని కేసీఆర్ చెబుతుంటారు. ఇలా కేసీఆర్ ప్రతీ అవకాశాన్ని ఓ పండుగలా నిర్వహిస్తూ తను తింటూ తోటివారికి పెడుతుంటారు..

To Top

Send this to a friend