ప్రజలకు కేసీఆర్ మరో కానుక


ఏదైనా వేడుక., సమావేశం.. జరిగితే సీఎం కేసీఆర్ ఏదో ఒక వరం ప్రకటించందే తిరిగి పోరు.. వారం క్రితం రైతులందరూ సీఎం క్యాంప్ ఆఫీసుకు వచ్చి మొరపెట్టుకోగానే ఉచిత ఎరువుల పథకాన్ని రైతుల కోసం ప్రకటించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఈ ఉచిత ఎరువుల పథకానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

ఇప్పుడు వరంగల్ లో నిర్వహించే టీఆర్ఎస్ వార్షికోత్సవ సభ కోసం కేసీఆర్ ప్రజలకు మరో వరం ప్రకటించేందుకు రెడీ అయినట్టు సమాచారం. హిందువుల పండుగలకు కొత్త దుస్తులు పంపిణీ చేయాలని డిసైడ్ అయినట్టు తెలిసింది. . ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఇక నుంచి దసరా, దీపావళి పర్వదినాలను పురస్కరించుకుని రాష్ట్రంలోని హిందువుల్లోని పేదలకు కొత్త బట్టలు పంపిణీ చేయనున్నారు. ఆర్థికంగా వెనకబడిన వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. హన్మకొండ, జనగామలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశాల్లో మంత్రి హరీశ్ రావు ఈ ప్రకటన వస్తుందని కార్యకర్తలకు చూచాయగా చెప్పారు. .

పండుగల సమయంలో ముస్లింలు, క్రైస్తవులకు ప్రభుత్వం దుస్తులు ఇస్తున్నట్లుగానే.. హిందువుల్లోని పేదలకు కూడా ఇక నుంచి దసరా, దీపావళికి దుస్తులును ఇవ్వనున్నట్లు తెలిపారు. వచ్చే దసరా నుంచే అమలు చేయనున్నట్లు ప్రకటించారు. పురుషులకు పంచె, కండువా, మహిళలకు చీర ఇవ్వనున్నారు. ఈ దుస్తులన్నింటిని రాష్ట్రంలోని చేనేతల ద్వారా ఉత్పత్తి చేయాలని నిర్ణయించారట.. ఇలా చేనేతలకు కూడా మరింత ఉపాధి కూడా కల్పించినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. లబ్దిదారుల ఎంపిక, పంపిణీ విధానంపై త్వరలోనే ప్రణాళిక రూపొందించనున్నారు.

To Top

Send this to a friend