ప్రభాస్‌ షాకింగ్‌ లుక్‌!


‘బాహుబలి’ సినిమాతో బాలీవుడ్‌ రేంజ్‌ను కూడా దాటి పోయిన యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం ‘సాహో’ సినిమా కోసం సిద్దమవుతున్నాడు. మరి కొన్ని రోజుల్లో ప్రభాస్‌ ‘సాహో’ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. ముంబయిలో మొదటి షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారు. భారీ స్థాయిలో ‘సాహో’ సినిమా కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ సినిమాకు తగ్గట్లుగా ప్రభాస్‌ కూడా తన లుక్‌ను పూర్తిగా మార్చేస్తున్నాడు. ‘బాహుబలి’ సినిమాలో కనిపించిన లుక్‌కు పూర్తి విరుద్దంగా ప్రభాస్‌ కనిపించబోతున్నాడు.

నిన్న మొన్నటి వరకు అమెరికాలో పూర్తి విశ్రాంతి తీసుకుంటూ ‘సాహో’ సినిమా కోసం సిద్దం అయిన ప్రభాస్‌ ఎట్టకేలకు మళ్లీ ఇండియా వచ్చాడు. తాజాగా ఇండియా వస్తున్న సమయంలోనే విమానంలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో ఫొటోలు తీసుకోవడం జరిగింది. ఆ సమయంలోనే ప్రభాస్‌ షాకింగ్‌ లుక్‌ రివీల్‌ అయ్యింది. ప్రభాస్‌ సన్నిహితులతో తీసుకున్న సెల్ఫీలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రభాస్‌ బాలీవుడ్‌ హీరో లుక్‌తో బాగున్నాడని కొందరు, మరి కొందరు మాత్రం ‘బాహుబలి’ లుక్‌తోనే ప్రభాస్‌ బాగున్నాడని ఫ్యాన్స్‌ అంటున్నారు. ‘సాహో’తో బాలీవుడ్‌పై ఎక్కువ దృష్టిని పెట్టాలనే ఉద్దేశ్యంతో ప్రభాస్‌ ఇలా లుక్‌ను మార్చాడా అనేది ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

To Top

Send this to a friend