భారీ రెమ్యూనరేషన్ తీసుకొంటున్న ప్రభాస్

బాహుబలి సిరీస్ తో ఒక్క సారిగా జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకొన్న తెలుగు నటుడు ప్రభాస్ . తాజాగా ప్రభాస్ నటించిన సాహో చిత్రం తెలుగు ప్రేక్షకుల  ఆదరణ పొందకున్నా హిందీలో మాత్రం తన  సత్తా చాటింది. ప్రభాస్ కి ఉత్తరాదిన ఉన్న క్రేజు కి నిదర్శనంగా నిలిచింది. దాంతో ప్రభాస్ కి ఇపుడు జాతీయ స్థాయిలో మార్కెట్ పెరిగింది. దరిమిలా రాబోయే ప్రభాస్ చిత్రాలు భారీ స్థాయిలో రూపొందుతున్నాయి. అదే క్రమంలో ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా ఊహించని స్థాయికి ఎదిగింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే త్వరలో ప్రభాస్ నటించ బోయే ఒక చిత్రానికి ఎవరూ ఊహించని పారితోషకం అందుకో బోతున్నాడు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ తన అల్లుడు నాగ్ అశ్విన్ దర్శ కత్వంలో  నిర్మించ బోతున్న ఫాంటసి చిత్రంలో నటించ బోతున్నందుకు గాను ప్రభాస్ అక్షరాలా 60 కోట్లు పారితోషకం తీసుకోబోతున్నాడట.
To Top

Send this to a friend