ప్రభాస్ పిచ్చోడు.. శంకర్ గ్రేట్..


సినిమాపై నా కంటే ప్రభాస్ కే ఎక్కువ ప్రేమ, నిబద్ధత ఉందని.. ప్రభాస్ లాంటి పిచ్చోడు (మ్యాడ్ ఫెలో) ఉంటేనే ఇలాంటి బాహుబలి సినిమాలు తీయడం సాధ్యమవుతుందని దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి అన్నారు. ప్రభాస్ లేకపోతే బాహుబలి లేనే లేదని తేల్చిచెప్పారు. బాహుబలి2 తమిళ వెర్షన్ ఆడియో ఆవిష్కరణ కోసం ఆదివారం చైన్నైకి వచ్చిన బాహుబలి యూనిట్ సభ్యులు ఈ సందర్భంగా చిత్రవిశేషాలను విలేకరులతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. తాను తమిళ అగ్రదర్శకుడు శంకర్ నుంచే వీఎఫ్ఎక్స్ ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నానని.. నా కంటే శంకర్ ఒక మెట్టు పైనే ఉంటారని వినమ్రంగా చెప్పారు. ఈ ఒక్క సమాధానంతో తమిళనాడు ప్రజలు, విలేకరుల మనసును జక్కన్న రాజమౌళి దోచుకున్నారు..

కాగా తమిళ వెర్షన్ ఆడియో విడుదల కార్యక్రమంలో తమిళ నటులు, బాహుబలి పాత్రదారులకు ప్రముఖ స్థానం కల్పించారు రాజమౌళి.. బిచ్చలదేవి నాజర్, కట్టప్ప సత్యరాజ్ లకు ఎక్కువ సేపు మాట్లాడే అవకాశం కల్పించారు.

ఇక ప్రభాస్ ను విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం విని వేదిక మీద ఉన్నవాళ్లు, కింద ఉన్నవాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. తనకు ఫేవరేట్ దర్శకుడు రాజమౌళి అని అనుకున్నవాళ్లందరికీ ప్రభాస్ షాక్ ఇచ్చారు. తన ఆల్ టైం ఫేవరేట్ దర్శకుడు మణిరత్నం అని.. తెలుగులో బాపు గారు అని ప్రభాస్ పేర్కొన్నారు. మూడో స్థానంలో రాజమౌళి ఉంటారని.. ఆ విషయం రాజమౌళికి తెలుసు అని పేర్కొన్నారు. బాహుబలి పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని ఊహాగానాలు అబద్దమని ప్రభాస్ అన్నారు. ఇలా ఆదివారం మొత్తం బాహుబలి ఆడియో రిలీజ్ ఫంక్షన్ తో హడావుడిగా గడిపింది బాహుబలి టీం..

To Top

Send this to a friend