అనుష్కతో లవ్.. స్పందించిన ప్రభాస్..

ప్రభాస్ బాహుబలి తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు మాట మార్చాడు. కొద్దికాలంగా ప్రభాస్ అభిమానులతో పాటు అందరినీ ఓ ప్రశ్న వేధిస్తోంది. అదే 40 ఏళ్లు దగ్గరకొస్తున్నా కూడా ప్రభాస్ ఎందుకు పెళ్లిచేసుకోవడం లేదనే ప్రశ్న అందరినీ తొలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా పట్టాలెక్కిస్తున్నాడు. అనుష్క చేతిలో కొన్ని తమిళ, తెలుగు సినిమాలున్నాయి. అయితే ఈ లవ్ బర్డ్స్ ప్రేమలో ఉన్నారా.? పెళ్లి చేసుకుంటారా అనే దానిపై ఎట్టకేలకు ప్రభాస్ స్పందించాడు. ఓ జాతీయ చానల్ తో మాట్లాడిన సందర్భంలో పెళ్లి గురించి, అనుష్కతో ఎఫైర్ గురించి అడగ్గా ప్రభాస్ సూటిగా సమాధానమిచ్చారు.

ఇప్పట్లో పెళ్లి చేసుకోనని.. అభిమానులు ఆందోళన చెందవద్దని.. ఇప్పడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పేశారు. అనుష్కతో తనకు ఎఫైర్ లేదని.. రెండు మూడుసినిమాల్లో కలిసి నటిస్తే ఎఫైర్ అంటకడతారా..? మా మధ్య అలాంటి బంధం ఏదీ లేదని కుండబద్దలు కొట్టారు. అనుష్కతో ఎఫైర్ గురించి ఎంతో మంది రాస్తున్నారని.. అలాంటి వార్తలను తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన దృష్టాంతా సాహో సినిమాపైనే ఉందన్నారు. ప్రభాస్.. అనుష్క లవ్ ఎఫైర్ పై క్లారిటీ ఇవ్వడం.. తాము లవ్ లేమని.. పెళ్లి చేసుకోనని ప్రభాస్ స్పష్టం చేయడంతో ఈ వివాదాలకు పుల్ స్టాప్ పడినట్టే కనిపిస్తోంది.

అనుష్క, ప్రభాస్ లు చాలా సినిమాల్లో కలిసి నటించారు. బిల్లా, మిర్చి బాహుబలి లాంటి సినిమాల్లో నటించారు. వీరిద్దరి లవ్, రోమాన్స్ సీన్లు ఆకట్టుకునేలా వచ్చాయి. అయితే అనుష్క, ప్రభాస్ లవ్ లో ఉన్నారని ప్రచారం జరిగినా ప్రభాస్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ.. పెద్దనాన్న కృష్ణంరాజు కానీ ఇప్పటివరకు సమాధానం చెప్పడం లేదు. ఇప్పుడు ప్రభాస్ లవ్ లేదూ ఏదీ లేదని తేల్చిపడేశాడు.

To Top

Send this to a friend