యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించిన వార్తలు కొన్నాళ్లుగా సోషల్ మీడియాను ముంచెత్తుతున్న విషయం తెల్సిందే. అనుష్కను పెళ్లి చేసుకుంటాడని, లేదు భీమవరంకు చెందిన ఒక ఇంజనీరింగ్ అమ్మాయితో ప్రభాస్ పెళ్లి అని, తాజాగా ఒక వ్యాపారవేత్త కూతురుతో ప్రభాస్ వివాహం జరగబోతుందని వార్తలు వచ్చాయి. అయితే ప్రభాస్ సన్నిహితుల నుండి తాజాగా మరో కొత్త సమాచారం బయటకు వచ్చింది.
ప్రభాస్ జాతకం ప్రకారం ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు పెళ్లి ప్రస్థావన తీసుకు రాకూడదట. ప్రస్తుతం ప్రభాస్‌కు పెళ్లి గడియలు రాలేదని, సెప్టెంబర్ తర్వాత నుండి ప్రభాస్‌కు మంచి సమయం ప్రారంభం కాబోతున్నట్లుగా ప్రభాస్ కుటుంభ్యులకు జోతిష్యులు చెప్పారట. కుటుంబ సభ్యులు చెబుతున్నదాని ప్రకారం సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ప్రభాస్ పెళ్లిని నిశ్చయించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం వివాహ నిశ్చితార్థం జరిపి వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ప్రభాస్ వివాహాన్ని నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో’ సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. వచ్చే నెలలో ‘సాహో’ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతుంది. ముంబయిలో జరగబోతున్న షూటింగ్లో త్వరలో ప్రభాస్ పాల్గొనబోతున్నాడు.
