డార్లింగ్ ప్రభాస్ మనసులో ఆ హీరోయిన్.?

ఎవరిగ్రీన్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ప్రభాస్ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు. బాహుబలి పూర్తికాగానే పెళ్లి చేసుకుంటానని చెప్పిన ప్రభాస్ ఇప్పుడు ఎందుకు ఆసక్తి చూపించడం లేదు. ప్రభాస్ కు పెళ్లి ఇష్టం లేదా.? చేసుకోవడం ఇష్టంలేదా.? లేక మనసులో ఎవరైనా ఉన్నారా ..? ఇప్పుడు ఇదే ప్రశ్న అందరి మదిని తొలుస్తోంది..

ప్రభాస్ తో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ అనుష్క.. బిల్లా నుంచి మొదలుపెడితే మిర్చి, బాహుబలి వరకు అనుష్క హైట్ కు ప్రభాస్ భారీ కాయం మిక్స్ తెరపై మంచి జోడిగా వెలుగింది. వీరు సినిమాల్లో కలిసి నటిస్తున్నప్పుడే సాన్నిహిత్యం బాగా పెరిగిపోయిందని ఇండస్ట్రీలో టాక్.. అది కొన్ని సందర్భాల్లో బయటపడింది కూడా.

ఇటీవల బాహుబలి ప్రమోషన్ లో భాగంగా అనుష్కను ఓ విలేకరి ప్రశ్నించాడు. ‘బాహుబలి సినిమాలో కోస్టార్స్ గా నటించిన ప్రభాస్, రానా.. వీరిద్దరిలో మీకు నచ్చిన అందగాడు ఎవరు.? ’ అని ప్రశ్నించాడు. దీనికి ఏమాత్రం తడుముకోకుండా జవాబిచ్చిందట అనుష్క. ఎవర్ గ్రీన్ బ్యాచ్ లర్ ప్రభాసే అందగాడు అని తేల్చేసింది. మరి రానా సంగతేంటి అని ప్రశ్నిస్తే.. బాహుబలి సినిమా షూటింగ్ టైంలో రానాను అన్నయ్య అని పిలిచిదాన్ని అని.. రానా కూడా సిస్టర్ అని పిలిచేదని అనుష్క జవాబిచ్చింది..

దీంతో అనుష్క మనసులో ప్రభాస్ ఉన్నాడనే విషయం తేటతెల్లమైంది. లవ్ చేస్తుందా లేదా అన్నది మాత్రం తెలియడం లేదు. అయితే ప్రభాస్ కూడా అనుష్కతో లవ్ లో ఉన్నాడనే ప్రచారం ప్రస్తుతం టాలీవుడ్ ని షేక్ చేస్తోంది. అదే నిజమని.. అందుకే ప్రభాస్ పెళ్లి చేసుకోవడం లేదా అన్న ప్రశ్నకు ఎవ్వరూ బదులివ్వడం లేదు. ఎలాగూ ప్రభాస్, అనుష్క చెప్పడం లేదు. దీంతో ఈ లవ్ బర్డ్స్ అవునా కాదా అన్నది తేలడం లేదు.

To Top

Send this to a friend