పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న సమయం…

మాగంటి శ్రీనాథ్, పల్లవి జంటగా మిసిమి మూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం సమయం. ఆర్ జే వై శ్రీరాజ దర్శకత్వం వహిస్తున్నారు. గద్ద రమేష్ నిర్మాత. ఎడ్ల జయపాల్ రెడ్డి సహ నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో ఆడియోను విడుదల చేసి…జూన్ చివరి వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. సమయం సినిమా ప్రోగ్రెస్ ను చిత్ర నిర్మాత గద్ద రమేష్ వివరిస్తూ…నేను వృత్తి రీత్యా ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ ఉద్యోగిని. సినిమా అంటే చాలా ఇష్టం. ఆ అభిరుచితోనే చిత్ర నిర్మాణ రంగంలోకి వచ్చాను. ఉద్యోగం చేస్తూనే సినిమాను పూర్తి చేశాం. ప్రణాళిక ప్రకారం, అనుకున్న బడ్జెట్ లోనే దర్శకుడు చిత్రీకరణ పూర్తి చేశారు. ఆశించిన దానికంటే సినిమా బాగా వచ్చింది. నాకు వ్యక్తిగతంగా సాహిత్యంపై మక్కువ. ఈ సినిమాలోని పాటలన్నీ నేనే రచించాను. హైదరాబాద్ గొప్పదనం వివరిస్తూ ప్రత్యేకంగా ఓ పాటను రూపొందించాం. ఆ పాట సమయం చిత్రానికి మరో ఆకర్షణ అవుతుందని భావిస్తున్నాం.అన్నారు. దర్శకుడు ఆర్ జే వై శ్రీరాజ మాట్లాడుతూ…దర్శకుడిగా తొలి అవకాశమిచ్చిన నిర్మాత గద్ద రమేష్ గారికి కృతజ్ఞతలు. ఆయన సహకారం వల్లే అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేయగలిగాం. లవ్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ కథతో సమయం సినిమా రూపొందించాం. తొలి సన్నివేశం నుంచే ఆసక్తి కలిగేలా కథనం సాగుతుంటుంది. చిత్ర స్క్రీన్ ప్లే ట్విస్ట్ అండ్ స్పాయిల్ అనే కొత్త తరహాలో ఉంటుంది. రివర్స్ స్క్రీన్ ప్లే పద్ధతిలో కథను తెరకెక్కించాను. ఈ తరహా సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ప్రేక్షకుల అంచనాలకు అందకుండా సినిమా ఉత్కంఠభరితంగా ఉంటుంది. శ్రీనాథ్, పల్లవి హీరో హీరోయిన్లుగా చక్కగా నటించారు. వాళ్ల కెమిస్ట్రీ బాగా కుదిరింది. అజయ్ ఘోష్, రవి ప్రకాష్, తేజ కీలక పాత్రల్లో ఆకట్టుకుంటారు. అన్నారు.

అంబటి శ్రీను, ప్రియాంకా నాయుడు, సుమన్ శెట్టి, రవికుమార్, వెంకీ, కర్ణ, శ్యామ్, మేఘన, మళ్లి రమేష్, రోహిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ శ్యామ్ ధూపటి, సంగీతం ఘన శ్యామ్, ఎడిటింగ్ వేణు కొడగంటి, ఆర్ట్ శ్రీనివాస చారి, కొరియోగ్రఫీ ఛార్లి, మోహన్ కిషోర్, ఫైట్స్ నందు, ప్రొడక్షన్ కంట్రోలర్ బెక్కం రవీందర్, కో డైరక్టర్ సాయి త్రివేది, కథ, కథనం, మాటలు, దర్శకత్వం ఆర్ జే వై శ్రీరాజ.

To Top

Send this to a friend