వద్దు రాజా.. పట్టుకుని తంతారు!


వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఎన్టీఆర్‌ జీవిత చరిత్రతో చిత్రాన్ని తెరకెక్కిస్తాను అంటూ ప్రకటించిన విషయం తెల్సిందే. అప్పటి నుండి కూడా ఎవరికి తోచిన విధంగా వారు తమ వాదన వినిపిస్తూనే ఉన్నారు. వర్మ సినిమా ప్రకటించిన వెంటనే లక్ష్మి పార్వతి స్పందిస్తూ అన్ని నిజాలు చూపించాలని, ఆయన భార్యగా తన పరిధిలోనే సినిమాను తెరకెక్కించాలని ఆమె సూచించింది. ఇక తాజాగా ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి కూడా వర్మ చేస్తాను అంటున్న ఎన్టీఆర్‌ సినిమాపై వ్యాఖ్యలు చేశాడు.

ఎన్టీఆర్‌ అంటే ఎలాంటి వివాదాలు లేని గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి సినిమాలో వివాదాస్పదంగా చూపించడం ఏమాత్రం సమంజసం కాదు. వర్మ అంటేనే వివాదాలకు పెట్టింది పేరు. అంటే ఖచ్చితంగా ఎన్టీఆర్‌ బయోపిక్‌ లో వివాదాలు ఉంటాయి. అలా వివాదాలు ఉంటే తెలుగు ప్రేక్షకులు వర్మను పరిగెత్తిస్తూ కొడతారు. ఆ విషయం దృష్టిలో పెట్టుకుని వర్మ ఎన్టీఆర్‌ చిత్రాన్ని వదిలేయడం ఉత్తమం. వర్మ ఇప్పటికే బాలీవుడ్‌కు పరిమితం అయ్యాడు. ఆ సినిమాను తీస్తే హైదరాబాద్‌కు కూడా రాలేక పోవచ్చు అని మరి కొందరు అంటున్నారు.

వర్మ మొదటి నుండి కూడా ఎవరేం చెప్పినా కూడా వినేరకం కాదు. తాను ఏదైతే అనుకుంటాడో అదే చేసుకుంటూ వేళ్లే రకం. అంటే ఎవరేం చెప్పినా కూడా వర్మ అనుకున్నట్లుగా ఎన్టీఆర్‌ సినిమాను తెరకెక్కించి తీరుతాడు. త్వరలోనే ఎన్టీఆర్‌ బయోపిక్‌కు సంబంధించి మరిన్ని వివరాలను వర్మ విడుదల చేయడం ఖాయంగా సినీ వర్గాల వారు అంటున్నారు.

To Top

Send this to a friend