ఎన్టీఆర్ తర్వాత 2.5 కోట్లతో పోసాని..

బిగ్ బాస్ షో.. తెలుగు ఎంటర్ టైన్ మెంట్ చానల్ మాటీవీలో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వచ్చే నెల నుంచి ప్రసారం కానుంది. ఒక ఇంట్లో సెలబ్రెటీలందరినీ ఉంచి వారి మధ్య ప్రేమలు, కోపాలు, రోమాన్స్ తదితర అన్నింటిని సీసీ కెమెరాలు పెట్టి తెరకెక్కిస్తారు. అయితే ఈ షోలో పాల్గొనేందుకు సినిమా, టీవీ నటులెవ్వరూ ఆసక్తి చూపించడం లేదట.. ఎందుకంటే ఇందులో టాస్క్ లు, కొంచె రిస్క్ గా వివాదాస్పదంగా ఉన్నాయట.. అంతేకాకుండా తమ తమ పనులన్నీ వదిలేసి కొన్ని నెలల పాటు ఓ ఇంట్లోనే ఉండాల్సి ఉంటుంది. అందుకే దీన్లో పాల్గొనడానికి ఎవరూ ఆసక్తి చూపించడం లేదు.

బిగ్ బాస్ లో పాల్గొనాలని టీవీ నటులు, సినిమా నటులనందరినీ సంప్రదిస్తున్నా ఎవ్వరూ ఒప్పుకోవడం లేదట.. లక్షలు ఇస్తామన్న స్పందన లేదు. చివరికి పోసాని ఒప్పుకున్నాడు. కానీ సినిమాలన్నీ వదిలి రావడానికి 2.5కోట్లు డిమాండ్ చేశాడు.. బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పుడు తెలుగులోనూ వస్తోంది. ఎన్టీఆర్ వ్యాఖ్యాత ఇది ప్రసారమవుతోంది.

బిగ్ బాస్ ప్రోగ్రాం లో పాల్గొనడానికి ఎవరూ ముందుకురాకపోయేసరికి ట్రైన్ రివర్స్ అయ్యింది. హిందీలో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యతగా సూపర్ హిట్ అయ్యింది. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి గాను ఇప్పటికే మాటీవీ రూ.10 కోట్లు ముట్టజెప్పింది. ఇక నటులు ఎవ్వరూ పాల్గొనకపోయేసరికి చివరకు పోసాని కృష్ణమురళీ ఈ షోలో పాల్గొనడానికి ఒప్పుకున్నారు. తన సినిమాలు, టీవీ షోలు వదులుకుంటానని.. అందుకోసం రూ.2.5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడట.. ఈ డిమాండ్ కు సదురు మాటీవీ యాజమాన్యం ఒప్పుకొని పోసానికి భారీ మొత్తం ఇస్తోంది..

To Top

Send this to a friend