పూజ కట్‌ చేయాలంటే 10 లక్షలు ..!


‘ముకుంద’, ‘ఒక లైలా కోసం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన పూజా హెగ్డే ఆ మద్య బాలీవుడ్‌కు వెళ్లి అమాంతం క్రేజ్‌ పెంచేసుకుంది. అక్కడ పెద్ద సక్సెస్‌లు దక్కక పోయినా కూడా స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. దాంతో తాజాగా ‘డీజే’ చిత్రంలో మంచి పారితోషికంతో నటించింది. ‘డీజే’ చిత్రంలో అమ్మడి అందాలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దాంతో మరిన్ని అవకాశాలు ఈమె తలుపుతడుతున్నాయి.

బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఎంపిక చేయడం జరిగింది. ఆ సినిమాలో నటించేందుకు గాను పూజా హెగ్డే ఏకంగా 2 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. భారీ పారితోషికం డిమాండ్‌ చేస్తున్నా కూడా ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇక స్టార్‌ హీరోయిన్స్‌కు రిబ్బన్‌ కట్టింగ్స్‌ అదేనండి షాప్‌ ఓపెనింగ్స్‌ ఆఫర్లు భారీగానే వస్తుంటాయి. కొన్ని గంటల పాటు షాప్‌ ఓపెనింగ్స్‌కు వెళ్లినందుకు రెండు నుండి అయిదు లక్షల రూపాయల పారితోషికంగా ఆ షాపింగ్‌ మాల్‌ వారు ఇస్తారు. కాని పూజా హెగ్డే మాత్రం ఏకంగా 10 లక్షల రూపాయలను డిమాండ్‌ చేస్తుంది.

హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో బ్రాంచ్‌లు ఉన్న ఒక ప్రముఖ వస్త్ర దుఖానం కొత్త బ్రాంచ్‌ ప్రారంభోత్సవంకు పూజా హెగ్డేను సంప్రదించగా పది లక్షలు డిమాండ్‌ చేసిందట. దాంతో మరో ప్రముఖ హీరోయిన్‌ను అయిదు లక్షలు ఇచ్చి ఓపెనింగ్‌ చేయించారు. కెరీర్‌ ఆరంభంలోనే పారితోషికంతో ఇలా భయపెడుతున్న ఈ అమ్మడు ముందు ముందు మరెంతగా పారితోషికంను డిమాండ్‌ చేస్తుందో అని సినీ వర్గాల వారు అంటున్నారు.

To Top

Send this to a friend