శిరీష రేప్ పై క్లారిటీ ఇచ్చిన పోలీసులు..

 

అనూహ్య మలపులు తిరుగుతున్న బ్యూటిషియన్ శిరీష, ఎస్.ఐ ఆత్మహత్య కేసులో పోలీసులు పక్కా ఆధారాన్ని కనుగొన్నారు.. శిరిష ఆత్మహత్య చేసుకున్న చేసిన పోస్టుమార్టం నివేదికలో శిరీష లోదుస్తులపై రక్తపు మరకలు ఉన్నట్టు వైద్యులు నివేదించారు. పోలీసులు ఈ నివేదిక ఆధారంగా శిరీషపై ఎస్.ఐ రేప్ చేశాడని నిర్ధారణకు వచ్చారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చాకే అసలు విషయం చెబుతామని ఇన్నాళ్లు పోలీసులు ఆగారు.. ఇప్పుడా నివేదిక రానే వచ్చింది..

పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వరావు ఈ మేరకు శిరీష డెత్ మిస్టరీపై వివరాలు వెల్లడించారు. మృతి చెందిన సమయంలో శిరీష ఫుల్లుగా మద్యం సేవించి ఉందని ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలిందని తెలిపారు. మృతురాలి లో దుస్తులపై ఉన్న మరకలు అత్యాచారానికి సంబంధించిన వి కావని స్ఫష్టం చేశారు. శిరీషపై రేప్ జరగలేదని.. ఆమెకు అయిన గాయాల మరకలే బట్టలకు అంటాయని తెలిపారు. శిరీషపై ఎస్సై కానీ రాజీవ్, శ్రవణ్ లు కానీ రేప్ చేయలేదని డీసీపీ స్పష్టం చేశారు.

రాజీవ్-శిరీషల ప్రేమ పంచాయతీని సెటిల్ చేయడానికి కుకునూర్ పల్లి ఎస్.ఐ వద్ద పంచాయతీకి వచ్చారు.. ఆయన పెద్దరికంగా పరిష్కరించాల్సింది పోయి.. వారితో కలిసి ఫుల్లుగా మద్యం తాగి శిరీష పైనే అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని వార్తలు వెలువడ్డాయి.. కానీ ఇప్పుడు రేప్ చేయలేదని పోలీసులు నిర్ధారించడంతో శిరీష సూసైడ్ మిస్టరీ వీడినట్టైంది. ఆమె అవమాన భారంతోనే ఆత్మహత్య చేసుకుందని పోలీసులు వెల్లడించారు. ఆమెను ఎవరూ హత్య చేయలేదని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైనట్టు పేర్కొన్నారు.

To Top

Send this to a friend