ప్రపంచంలోనే అత్యంత భద్రత గల రూంలో మోడీ


భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం ఇజ్రాయిల్ లో పర్యటిస్తున్నారు. ఆ దేశంలో మోడీకి విశేష ఆదరణ లభిస్తోంది. అమెరికా అధ్యక్షుడికి సమానంగా గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ ప్రధాని మోడీ వెంటే ఉంటూ వివిధ ప్రాంతాలను చూపిస్తూ కీలకమైన రక్షణ, సహకార, అంతరిక్ష ఒప్పందాలను చేసుకుంటున్నారు.

ఇజ్రాయిల్ లో ప్రధాని మోడీ ఉండడానికి ఇచ్చిన హోటల్ గదిని చూసి మోడీయే షాక్ అయ్యారు. ఈ సూట్ ప్రపంచంలో అత్యంత భద్రతగలదని మోడీ వ్యాఖ్యానించడం విశేషం. ఇంతవరకూ ఏ దేశంలో తాను ఇంతటి భద్రతగల రూంను తాను చూడలేదని మోడీ పేర్కొన్నారు.

మోడీకి ఇజ్రాయిల్ లోని కింగ్ డేవిడ్ హోటల్ లో రూం కేటాయించారు. ఈ గది మొత్తం బుల్లెట్ ఫ్రూఫ్ తో నిర్మించబడింది. అంతేకాదు.. రసాయన దాడుల నుంచి పూర్తి రక్షణ ఉండేలా గదిని నిర్మించారు. ఒకవేళ అనుకోకుండా హోటల్ పై పెద్ద బాంబు దాడి జరిగినా గది కింద ఉన్న రహస్య ద్వారం ద్వారా మోడీని రక్షించేలా ఏర్పాట్లు ఉన్నాయట. ఇంత సెక్యూరిటీగా గదిని కేటాయించి మోడీ భద్రతకు అమిత ప్రాధాన్యం ఇస్తోందట ఇజ్రాయిల్ దేశం..

To Top

Send this to a friend