లాలూపై మోడీ రివేంజ్ మొదలైంది..

 

ఈరోజు ఉదయం నుంచి బీహార్ లోని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ ఇంట్లో సీబీఐ అధికారులు దాడులు మొదలు పెట్టారు. పాట్నాలోని లాలూ నివాసంలో 12 మంది సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ , పాట్నా, రాంచీ, పూరి, గురుగ్రామ్ తో సహా 12 ప్రాంతాల్లో ముమ్మరంగా సోదాలు చేశారు.

 

అసలు కేసు విషయానికి వస్తే.. లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైల్వే శాఖమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవినీతిపై ఇప్పుడు సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి లాలూ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. 12 ఏళ్ల క్రితం రైల్వే మంత్రిగా లాలూ రెండు రైల్వే హోటళ్లను ప్రైవేట్ హాస్పిటాలిటీ గ్రూప్ కు ట్రాన్స్ ఫర్ చేసినట్టు ఆరోపణలున్నాయి. ఆ కేసు విషయంలోనే లాలూను మూసేయాలని బీజేపీ… సీబీఐతో దాడులకు దిగింది..

 

లలూపై సీబీఐ దాడులతో అధికార జేడీయూ నితీష్ కుమార్ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఈ వ్యవహారం తన మెడకు చుట్టుకుంటుందని నితీష్ ఉన్నతాధికారులతో భేటి అయ్యారు. లలూ ప్రసాద్ యాదవ్ ను కేసులు చుట్టుముట్టడంతో ఆయనతో కలిసి ప్రభుత్వం లో కొనసాగాలా.? వద్దా అనే విషయంపై నితీష్ సమాలోచనలు జరుపుతున్నట్టు తెలిసింది..

 

బీహార్ లో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ , నితీష్ , కాంగ్రెస్ కూటమి బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించింది. లాలూ ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలోనే లాలూపై మోడీ రివేంజ్ మొదలైంది. శశికళను జైలుకు పంపి అన్నాడీఎంకే ను హస్తగతం చేసుకున్నట్టు ఇప్పుడు లాలూను లోపలికి పంపి నితీష్ తో బీహార్ ను ఏలాలని మోడీ స్కెచ్ గీసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే లాలూపై సీబీఐ దాడి మొదలైంది..

To Top

Send this to a friend